హిందువులను సంఘటితం చేస్తున్నటువంటి శ్రీ బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ జన్మదిన వేడుకలు

ఎడపల్లి , సెప్టెంబర్ 09 ( లోకంతీరు ) : యువత చదువుతో పాటు ఆధ్యాత్మికచింతన అలవర్చుకోవాలని పిట్లకృష్ణ మహారాజ్ భక్త బృందం శిష్యులు అన్నారు.నిజామాబాద్ ఎడపల్లి మండల కేంద్రంలోని ఎస్సి వసతి గృహంలో, వడ్డేపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు, అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు పిట్లకృష్ణ మహారాజ్ జన్మదినం సందర్భంగా భక్త బృందం శిష్యులు నోట్ బుక్స్, పెన్నులు,పండ్లను పంపిణీ చేశారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం,ధర్మ రక్షణ కొరకు నిరంతరం కృషి చేస్తూ అందరిలో భక్తి భావాలు పెంపొదిస్తూ హిందువులను సంఘటితం చేస్తున్నటువంటి శ్రీ బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. యువత ఆధ్యాత్మిక భక్తి భావాలు కలిగి ఉన్నప్పుడే సమాజంలో మార్పు వస్తుందని, సమాజాన్ని మార్చేది నేటి యువకులేనని అన్నారు.అంతకుముందు వడ్డేపల్లి గ్రామంలో గల శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పిట్ల కృష్ణ మహారాజ్ శిష్య బృందం సభ్యులు గంగా ప్రసాద్, రాజు, అశోక్ గౌడ్, రాజ్ కుమార్, యాదగిరి, భూమయ్య, పురుషోత్తం, దేవి సేటు, మంజుల, గంగాధర్, శ్రీనివాస్, ఈశ్వర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, బాల బాలికలు, గ్రామస్తులు పాల్గొన్నారు.