Take a fresh look at your lifestyle.

ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాలకు యూజీసీ ఆధ్వర్యంలో స్వయం ప్రతిపత్తి హోదా….

0

ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాలకు యూజీసీ ఆధ్వర్యంలో స్వయం ప్రతిపత్తి హోదా

నిజామాబాద్, మే 31 ( లోకంతీరు ) :      తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న ప్రముఖ విద్యా సంస్థ ఎస్ ఎస్ ఆర్ డిగ్రీ కళాశాలకు 2025-26 విద్యా సంవత్సరం నుండి నూతనంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), న్యూ ఢిల్లీ వారు స్వయం ప్రతిపత్తి హోదాను కల్పించారు.ఈ గుర్తింపు ద్వారా కళాశాల విద్యా ప్రాముఖ్యత, సృజనాత్మకత, సమగ్ర విద్యా అభివృద్ధి దిశగా సాగుతున్న ప్రయాణంలో ఓ కీలక మైలురాయిగా నిలిచింది. స్వయం ప్రతిపత్తిలో, కళాశాలకు స్వంత పాఠ్య ప్రణాళిక రూపొందించుకోవడం, కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం, అధునిక విద్యా అవసరాలు, పరిశ్రమ అవసరాలను ప్రతిబింబించే విధంగా విద్యార్థులను తిర్చిదిద్దడం స్వయంగా కళాశాల పరీక్షల నిర్వహణ, మూల్యాంకన విదానాలను స్వేచ్ఛగా అమలు చేసే అవకాశం లభిస్తుంది.ఈ సందర్బంగా కళాశాల చైర్మన్ డా.ఎం. మరయ్య గౌడ్ మాట్లాడుతూ, “స్వయం ప్రతిపత్తి హోదా మా గత 33 సం||ల నిరంతర కృషికి గౌరవ సూచకమే కాక, భవిష్యత్తుకు సంబంధించిన బాధ్యతను సూచిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులలో మెరుగైన నైపుణ్యా కల్పిచడం, జ్ఞానం కల్పించే దిశగా వినియోగించుకుంటాం” అని గర్వంగా పేర్కొన్నారు.ఈ హోదా కళాశాల స్థిరమైన విద్యా ప్రదర్శన, అధిక నాక్ రేటింగ్ (స్కోరు),పరిపాలన, అధ్యాపక అభివృద్ధిలో నిరూపితమైన ట్రాక్ రికార్డు ఆధారంగా లభించింది.కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు మరియు పూర్వ విద్యార్థులు యూజీసీ, తెలంగాణ విశ్వ విద్యాలయం, ఈ ప్రయాణంలో మద్దతు ఇచ్చిన అందరు భాగస్వాములకు ఎస్ ఎస్ ఆర్ తరుపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.

Leave A Reply

Your email address will not be published.