Take a fresh look at your lifestyle.

న్యాయ చైతన్య సదస్సులో పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతలక్ష్మి……

0

న్యాయ చైతన్య సదస్సులో పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతలక్ష్మి.

– ఘనస్వాగతం పలికిన ఆర్మూర్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి

ఆర్మూర్,  డిసెంబర్ 06 ( లోకంతీరు ) : ఆర్మూర్ మండల న్యాయ చైతన్య సేవ అధికార సంఘం ఆధ్వర్యంలో ఆర్మూర్ సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీదేవి అధ్యక్షతన “న్యాయ చైతన్య సదస్సు” కార్యక్రమాన్ని ఆర్మూర్ కోర్టు ప్రాంగణంలో శనివారం ఉదయం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జివిఎన్ భారతలక్ష్మి హాజరయ్యారు. ముందుగా ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు జక్కుల శ్రీధర్,జెస్సు అనిల్ కుమార్ తదితర న్యాయవాదుల ఆధ్వర్యంలో జిల్లా జడ్జి ని ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా ఆర్మూరు సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి జిల్లా జడ్జ్ భారత లక్ష్మి కి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మండల న్యాయ సేవ సంఘ సభ్యులు మామిడి రాజేశ్వర్ మాట్లాడుతూ నేడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని కోర్టులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో పొందపరచినటువంటి చట్టాలను మనమందరం గౌరవిస్తూ మన వద్దకు వచ్చిన వారికి న్యాయం కోసం పోరాటం చేయాలని, చట్టం ముందు అందరూ సమానులే అని ఆయన కొనియాడారు.అంతకు ముందు ఈ కార్యక్రమానికి ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఉన్న పలు మండలాల సబ్ ఇన్స్పెక్టర్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఆర్మూర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెంకటేశ్వర రెడ్డి హాజరై వారి పోలీసు బృందం చేత జిల్లా ప్రధాన న్యాయమూర్తి కి స్వాగతం పలికారు. కాగా జిల్లా జడ్జి డివిజన్ పరిధిలో ఉన్న ప్రతి మండలాల ఎస్ఐలను పలకరిస్తూ వారి వద్ద నుండి గౌరవ వందనం స్వీకరించారు.ఇట్టి కార్యక్రమము ముఖ్య ఉద్దేశం ఈనెల 21న లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సభ అధ్యక్షత వహించిన సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీదేవి తమ న్యాయవాదులను కోరారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మి మాట్లాడుతూ.. జిల్లాలో అన్నిచోట్ల వీడిసి పేర్లతో ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని విడిసి ని అరికట్టడానికి పోలీస్ శాఖ ముందుండాలని సూచించారు. పోలీస్ శాఖ లో ఉన్న అన్ని నిఘా బలగాలు మరింత పటిష్టంగా విధులు నిర్వహించాలని, ఫోక్స్ చట్టం, షీ టీం సాగిటి సఖి టీం చిన్నపిల్లల నుండి మొదలుకొని పాఠశాల కళాశాలలో ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అలాగే గ్రామాల్లో విడిసి కమిటీ సభ్యులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ముందుకు వచ్చినట్లయితే శిక్ష అర్హులుగా అవుతారని చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని విడిసి వారిని ఈ సందర్భంగా హెచ్చరించారు. విడిసి పై పలు అంశాలపై వివరించారు. కక్షిదారులు ఇరువర్గాల వారు న్యాయవాదులను సంప్రదించి తమ ఇష్టపూర్వకంగానే లోక్ అదాలత్ లో పాల్గొని స్వచ్ఛందంగా తమ సమస్యను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఈనెల 21న లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆర్మూర్ జడ్జ్ లోక్ అదాలత్ ద్వారా అవగాహన కొరకు పోస్టర్లను ప్రచురించి జిల్లా ప్రధాన న్యాయమూర్తితో ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు జక్కుల శ్రీధర్ జెస్సు అనిల్ కుమార్, గటడి ఆనంద్, ఆర్మూర్ మండల న్యాయ సేవ సంఘం అడాప్ట్ కమిటీ సభ్యులు మామిడి రాజేశ్వర్, మాజీ భారత్ అసోసియేషన్ అధ్యక్షులు తెడ్డు నరసయ్య, జిజి రామ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఖాందేష్ శ్రీనివాస్, మహిళా న్యాయవాదులు ఖాందేష్ సంగీత, ఆర్మూర్ ప్రముఖ సీనియర్ భూపతి రెడ్డి, జూనియర్ న్యాయవాదులు సతీష్, డివిజన్ పరిధిలో ఆయా మండలాల ఎస్సైలు ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్, బాల్కొండ సిఐ శ్రీధర్ రెడ్డి, భీమ్గల్ సిఐ లతోపాటు ఆర్మూర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెంకటేశ్వర్ రెడ్డి పోలీస్ సిబ్బంది కోర్టు న్యాయవాదుల సిబ్బంది పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.