ఏకగ్రీవంగా వీడిసి కమిటి ఎన్నిక
– పోటీతత్వంతో గ్రామాభివృద్ధికి పాటుపడుతాం

తానుర్ , జూన్ 27 ( లోకంతీరు ) : పోటీతత్వంతో ముందుకు వెళ్లి గ్రామాభివృద్ధికి పాటు పడతామని నూతనంగా ఎన్నికైన బోసి వీడిసి కమిటీ సభ్యులు అన్నారు.గురువారం రాత్రి నూతనంగా ఎన్నికైన అనంతరం వారు మాట్లాడుతూ
నిన్నటి వరకు అనునిత్యం బోసి
గ్రామాభివృద్ధి కమిటీ కోసం పోరాడిన బాలేరావ్ ఉత్తమ్ చైర్మన్,టక్కన్ రాజ్ కుమార్ ప్రధాన కార్యదర్శిల ఆధ్వర్యంలో శ్రీ మహాదేవ్ మందిరం దాతల సహకారంతో *సుమారు డెబ్భై లక్షల (70,00,000/-)రూ||లతో భవ్య మందిరం నిర్మించి* గ్రామంలో ఆధ్యాత్మిక శోభను చేకూర్చారని అన్నారు.అలాగే కాశీ నుండి శివలింగం,నంది, గణపతి, కుమారస్వామి విగ్రహాలను తీసుకోని వచ్చి అంగరంగ వైభవంగా ప్రతిష్టాపన మహోత్సవాన్ని జరిపించిందని. అలాగే ఆ గుడికి అనుసంధానంగా కళ్యాణ మండపం నిర్మించి పేద,బీద,బుడుగు,బలహీన వర్గాల వారికి అతి తక్కువ ధరలలో పంక్షన్ హాల్ అందుబాటులోకి తెచ్చి చిరకాల కోరికనుతీర్చి ఘనతను సాధించిందన్నారు.అలాగే గ్రామ యువకుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సంపూర్ణ మద్యపాన నిషేధం విధించి జిల్లాలో చరిత్ర సృష్టించిందన్నారు. గ్రామంలోని గుడి,బడి అభివృద్ధికి నిరంతరం కృషిచేసిందన్నారు. అంతేగాక అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి భోసి గ్రామాన్ని ప్రగతి పథంలో దూసుకుపోయేలాగా చేసిందని అలా విశేష కృషిచేసిన గత కమిటీకి గ్రామస్థులందరి తరపున ధన్యవాదములు తెలుపుతూ వారికి మార్గదర్శనంగా తీసుకొని మరింత గ్రామాభివృద్ధికి అందరి సహకారం తో అభివృద్ధి చేస్తామని అన్నారు. నూతన కమిటీ చైర్మన్ గా రోగల్ బాలాజీ , ఉపాధ్యక్షులు మాముల్ వార్ గంగాధర్ , ప్రధాన కార్యదర్శి బాయి నర్సింలు , కోశాధికారి టక్కన్ రాజ్ కుమార్ , సభ్యులు సల్ల రాజన్న , బుట్టి ప్రసాద్, జలాల్ హన్మాండ్లు ,ప్రసాద్ ,రాజన్న లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు గ్రామస్తులు తెలిపారు.