ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పెంచాలి

ఎడపల్లి, ఆగస్టు 01( లోకంతీరు ): ముఖ్యమంత్రి ఎనమూల రేవంత్ రెడ్డి ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం చేయూత పెన్షన్ లన్ని తక్షణమే పెంచాలని, నూతన పింఛన్ లను మంజూరు చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్య వంశీ డిమాండ్ చేశారు. ఎడపల్లి మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.ఈనెల ( ఆగస్టు13)న పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ నేతృత్వంలో నిర్వహించబోయే చలో హైదరాబాద్ మహాగర్జన సభను దివ్యాంగులు , చేయూత పింఛన్దారులందరూ విజయవంతం చేయాలని ఆమెకోరారు. 5వ తేదిన ఆర్మూర్ పట్టణానికి మందకృష్ణ మాదిగ వస్తున్నారని ఆమె తెలిపారు.మహా గర్జన
సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులకు రూ 6000 వేల రూపాయలు, వృద్దులువితంతువులు ఒంటరి మహిళలు నేతగీతబీడీ కార్మికులతో పాటు అన్ని రకాల చేయుత పెన్షన్లను రూ.4000 రూపాయలుపెంచాలన్నారుకండరాల క్షీణతవారికి 15000 రూపాయలు ఇవ్వాలని తక్షణమే పెంచాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పింఛన్లు పెంచడం సరికాకపోతే రాజకీయ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారుకాంగ్రెస్ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోటానికి పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో ఆగస్టు13 న హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో పెన్షన్ దారుల మహాగర్జనను నిర్వహిస్తున్నందున ఈ సభకు,ప్రతి గ్రామం నుండి దివ్యాంగులు పెన్షన్ దారులు తప్పకుండా తరలిరావాలని అలాగే చలో హైదరాబాద్ సభను విజయవంతం చేయాలని సుజాత సూర్యవంశీ పిలుపునిచ్చారు సమావేశంలోఎమ్మార్పీస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లసింగారి భూమయ్య మాదిగ, ఎడపల్లి మండల అధ్యక్షుడు ఎర్రోళ్ల మారుతి మాదిగ, ఎంఎంఎస్ జిల్లా సీనియర్ నాయకురాలు పిల్లన గొయిల సావిత్రి మాదిగ, మండల ప్రధాన కార్యదర్శి పెరవలి నాగభూషణం మాదిగ, తాడెం అబ్బయ్య మాదిగఎంఎస్పి నియోజకవర్గ నాయకులు జాధవ్ ఫకీర నాయక్ ఎంఎస్పి నాయకులు రమణ, ఎమ్మార్పీస్ సీనియర్ నాయకులు కొండ్ర పాండు మాదిగ, ఉపాధ్యక్షులు పోతనపల్లి ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు