ఎడపల్లి మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రాల తనిఖీ

ఎడపల్లి ఆగస్టు 01 ( లోకంతీరు ) : ఎడపల్లిమండల కేంద్రంలోని నయా బాధి అంగడి బజార్ ఉన్న మూడవ నంబరు అంగన్వాడి కేంద్రంలో గురువారం అక్రమంగా అంగన్వాడి సరుకులను తరలిస్తుండగా కాలనీ యువకులు పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పగించారుఈ సంఘటనపై బోధన్ సి డి పి ఓ పద్మ ముగ్గురు సూపర్వైజర్లను శుక్రవారం విచారణకు పంపారు విచారణ విషయాలను వెల్లడించేందుకు వారు అంగీకరించలేదు. బియ్యం, పాలు, బాలామృతం కేంద్రం నుండి అక్రమంగా తరలిస్తుండడం అనే విషయాన్ని విచారించాల్సింది పోయి తల్లులను పిలిచి తమకు సక్రమంగా సరుకులు అందిస్తున్నట్లు సంతకాలు తీసుకోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు విషయాన్ని తప్పుదోవ పట్టించి తు తు మంత్రంగా విచారణ నివేదిక తయారు చేస్తున్నట్టు స్పష్టం అవుతుంది. అంగన్వాడి కేంద్రంలో సరుకుల మిగులు, రోజువారి లెక్కలు సరిచూడాల్సింది ఉండగా అవేమి కాకుండా తల్లులను పిలిచి సంతకాలు తీసుకోవడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విచారణలో అక్రమంగా బియ్యం సరుకులను తరలిస్తున్న యువకులను విచారించాల్సింది పోయి తల్లులలో విచారించడం ఏమిటని పలువురు అంటున్నారు. విషయాన్ని నీరుగార్చి చివరికి మామ అనిపించేలా విచారణ జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి మీడియాతో మాట్లాడేందుకు విచారణకు వచ్చినసూపర్వైజర్లు నిరాకరించారువిచారణ నివేదిక సిడిపిఓ పద్మకు అందిస్తున్నట్లు తెలిపారు