Take a fresh look at your lifestyle.

మత్తు, పొగాకు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి….

0

మత్తు, పొగాకు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

ఎడపల్లి, ఆగస్టు 01( లోకంతీరు ) :  పొగాకు, మత్తు పదార్థాలు సేవించడం పట్ల ఊపిరి తిత్తులు దెబ్బతిని మనిషిని శారీరకంగా మానసికంగా అనేక ఇబ్బందులు పెడతాయని వైద్యాధికారి శ్రీకాంత్ అన్నారు. సాలూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ప్రపంచ ఊపిరితిత్తుల నివారణ దినోత్సవం తో పాటు, తల్లిపాల వారోత్సవాల కార్యక్రమoలో భాగంగా ప్రజలకు అవగాహన చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు మాట్లాడాతూ పొగాకు మధ్య పదార్థాలకు యువతదూరంగా ఉండాలని వారు పిలుపునిచ్చారు. పొగాకు వలన అనేక ఇబ్బందులు వస్తాయన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే పైన పేర్కొన్న విసునాలకు దూరంగా ఉండాలని వైద్యులు పిలుపునిచ్చారు. అలాగే తల్లిపాల వారోత్సవ కార్యక్రమంలో భాగంగా తల్లిపాల ప్రాముఖ్యతపై వైద్యాధికారి రాజ్ కుమార్ మాట్లాడారు. తల్లిపాలు పిల్లల ఆరోగ్యానికి చాలా ముఖ్యమన్నారు. ఇది పిల్లల ఎదుగుదలకు అభివృద్ధికి అవసరమైన అన్ని పోషకాలను అందిస్తుందన్నారు. అలాగే తల్లిపాలలో యాంట్ బాడీలు ఉంటాయన్నారు. ఇవి పిల్లల కు రోగ నిరోధక శక్తిని అందిస్తాయి. తల్లిపాలు పిల్లల మెదడు అభివృద్ధికి సహాయపడతాయి అలాగే జ్ఞాపకశక్తి ప్రజ్ఞ వికాసానికి ఎంతో దహనం చేస్తాయన్నారు. కార్యక్రమంలో సూపర్వైజర్ సాయి కుమారి, సిబ్బంది రమణకుమార్ స్థానిక మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.