Take a fresh look at your lifestyle.

ఐబీ తాండూర్ లో ఘనంగా అంతర్జాతీయ ఆటో డ్రైవర్ దినోత్సవ వేడుకలు….

0

ఐబీ తాండూర్ లో ఘనంగా అంతర్జాతీయ ఆటో డ్రైవర్ దినోత్సవ వేడుకలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో చీఫ్ ఆగస్టు 01( లోకంతీరు ) : ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం పురస్కరించుకొని తాండూర్ మండల్ ఆటో యూనియన్ అధ్యక్షులు  మామహమ్మద్ హబీబ్ పాషా ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని కేంద్రంలోని ఐబి ఫ్లైఓవర్ వద్ద కేక్ కట్ చేసి కార్యక్రమం జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో తాండూర్ ఆటో యూనియన్ మండల కోశాధికారి ఓరగంటి శుభాకార్ మాట్లాడుతూ ఈరోజు ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం జరుపుకోలేని దయనీయ పరిస్థితిలో ఉన్న ఆటో డ్రైవర్ల ఐక్యతను చాటుకోవడం కోసం తప్పనిసరి పరిస్థితిలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామని చెప్పారు ఇదే కార్యక్రమంలో తాండూరు మండల జనరల్ సెక్రెటరీ కొత్త శంకర్ మాట్లాడుతూ మా తాండూరు మండల ఆటో యూనియన్ నుంచి ఆటో కార్మికులకు ఎలాంటి సమస్య వచ్చిన ఇప్పటివరకు మా ఆటో యూనియన్ తరపున సహాయ సహకారాలు అందిస్తూ కార్మికుల సంక్షేమం సంక్షేమం కోసం పాటుపడుతున్నామని ఇక ముందు కూడా తాండూరు మండలల్ ఆటో కార్మికుల సహాయ సహకారాలతో ముందుకు సాగాలని దిశ నిర్దేశాన్ని ఇచ్చారు ఈ కార్యక్రమానికి ఉద్దేశించి అధ్యక్షులు మహమ్మద్ హబీబ్ పాషా మాట్లాడుతూ తాండూరు మండలంలోని ప్రతి ఆటో కార్మికులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసు శాఖకు సహకరించాలని మనం ఎంచుకున్న ఆటో డ్రైవర్ వృత్తిలో అనునిత్యం ప్రమాదం పొంచి ఉందనే విషయాన్ని గ్రహించి మద్యం సేవించి ఆటోలు నడపరాదని మన వెనుక మన కుటుంబాలు ఉన్నాయి కాబట్టి మనకేదైనా ప్రమాదం జరిగితే మన కుటుంబం ఇబ్బందుల అవుతాయని విషయాన్ని గుర్తు చేశారు శుక్రవారం ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవ వేదికగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకానికి మేము వ్యతిరేకం కాదని ఆర్థిక ఇబ్బందులతో ఇప్పటికే 87 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారని పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తుందని ఇప్పటికైనా ప్రభుత్వం ఆదుకోవాలని ఆటో కార్మికులకు 2023 ఎన్నికల సమయంలో ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని సంవత్సరానికి ₹12,000 ఇస్తామని వాగ్దానం చేసి ఇప్పటివరకు వాటి ఊసు కూడా ఎత్తడం లేదు ఇప్పటికైనా రాబోయే అసెంబ్లీ సమావేశాలలో ఆటో డ్రైవర్ల కోసం చర్చించి దయచేసి సమస్యలు పరిష్కరించాలని తాండూర్ ఐబీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ విలేకరుల ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం ఇప్పటికైనా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి మాకు న్యాయం చేయాలని అన్నారు మేము తాండూరు మండల్ ఆటో యూనియన్ తరఫున ఏ కార్యక్రమం చేసిన సహకరిస్తున్న తాండూర్ ఐబీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ మిత్రులకు అందరికీమీడియా మిత్రులు అందరికీ తాండూర్ మండల్ ఆటో యూనియన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు చంద్ ఖాన్ ప్రధాన కార్యదర్శి కొత్త శంకర్ కోశాధికారి ఓరగంటి శుభాకార్ సలహాదారులు విద్యాసాగర్ గౌరవ సలహాదారులు రాజనంద్ కార్య నిర్వాహక సభ్యులు రేగుల రవి వివిధ అడ్డా అధ్యక్షులు ఉపాధ్యక్షులు అధ్యక్షులు ఉపాధ్యక్షులు తోటి ఆటో కార్మికులు అందరూ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.