బాల త్రిపుర సుందరి దేవి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భూమి పూజ
ఎడపల్లి, సెప్టెంబర్ 10 ( లోకంతీరు ) : ఏడపల్లి మండలం మంగళ్ పాడ్ గ్రామంలోని, బాల త్రిపుర సుందరీ దేవి ఆలయ పాలకవర్గం సభ్యుల ఆధ్వర్యంలోబుధవారము, దేవి మండపo ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించారు. ఈనెల 25న దుర్గ దేవి (దుర్గ మాత), నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అమ్మవారి ఆలయ ఆవరణంలో, పాలకవర్గం గ్రామ పెద్దలు,భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వాహీంచారు.అనంతరం బాల త్రిపుందరి దేవి ఆలయ పాలకవర్గం మాట్లాడారు.నవరాత్రి ఉత్సవాల శుభ సందర్భంగా,అమ్మవారికి పూజలు, అభిషేకాలు, కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. నవరాత్రి ఉత్సవాలలోబాగంగా కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామన్నారు . గ్రామస్తులు తమ వంతు సహకారాన్ని అందించాలని వారు కోరారు.కార్యక్రమంలో,అధ్యక్షులు,నార్ల గోవర్ధన్ దంపతులు ఉపాధ్యక్షులు,సుంకరి సురేష్ దంపతులు,లతోపాటు ఆలయ కమిటీ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు ,యువకులు తదితరులు పాల్గొన్నారు.