యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
ఎడపల్లి, సెప్టెంబర్ 16 ( లోకంతీరు ) : ప్రస్తుత రోజుల్లో యువతమత్తు పదార్థాలకు, మద్యపానానికి దూరంగా ఉండాలని, అప్పుడే ఆకుటుంబాలు బాగుపడతాయని ఎడపల్లి ఏఎస్ఐ ఇలియాస్ అన్నారు.జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎడపల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో డ్రగ్స్ ,కల్తీ కల్లు నివారణ అరకట్టేందుకు మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపాన పోలీస్సిబ్బంది యువతకు, గ్రామ పెద్దలకు అవగాహన నిర్వహించారు. మత్తు పదార్థాలకు కల్తీ కళ్ళకు అలవాటు పడినవారు అన్ని రకాలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుందని గుర్తు చేశారు. మత్తు పదార్థాలతో పాటు కల్తీకల్లుకు అలవాటు పడినవారుమానుకోవడమే మంచిదన్నారు.భవిష్యత్తు పది కాలాలపాటుఉంటుందన్నారు.మత్తు పదార్థాలు, కల్తీ కల్లు కు బానిసైన వారి కుటుంబాలు రోడ్డున పడ్డ సంఘటనలు ఉన్నట్లు పోలీస్ సిబ్బంది గుర్తు చేశారు. కేసరి ప్రభాకర్ గౌడ్, గ్రామ యువకులు,పెద్దలు తదితరుల అవగాహన సదస్సులో పాల్గొన్నారు.