Take a fresh look at your lifestyle.

సదాశివనగర్ నూతన సిఐ….

0

సదాశివనగర్ నూతన సిఐ గా బి. సంతోష్ కుమార్

సదాశివ నగర్, జనవరి 31 ( లోకం తీరు ) : సదాశివనగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బి సంతోష్ కుమార్ బాధ్యతలు బుధవారం స్వీకరించారు. కామారెడ్డి ఎస్పీ2 గా ఉన్న సంతోష్ కుమార్ ను సదాశివ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నియమించారు. సదాశివ నగర్ సిఐగా ఉన్న ఎస్ రామన్ ఐజి కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని కోరారు. సదాశివ నగర్ సిఐగా సంతోష్ కుమార్ బాధితులు స్వీకరించి న అనంతరం మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం పాటుపడతానన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించే వారి సమాచారం పోలీసులకు అందజేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది సీఐ సంతోష్ కుమార్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.