నేడు సుభాష్ నగర్ స్విమ్మింగ్ పూల్ లో మట్టిస్నానం
నిజామాబాద్ అర్బన్, సెప్టెంబర్ 20 ( లోకంతీరు ) : రానున్న విజయదశమి పండుగను పురస్కరించుకొని (ఆరోగ్యాభివృద్దిరస్తు) మూళికాచూర్ణయుక్త మట్టిస్నానం ప్రముఖ యోగాచార్యులు యోగ థెరపిస్ట్, మడ్ బాత్ స్పెషలిస్ట్ ఆచార్య యోగ సిద్ధి రాములు గురూజీ గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ నెల 21 వ తేదీ ఉదయం 7:20 గంటలకు నగరంలోని సుభాష్ నగర్ లో వున్న స్విమ్మింగ్ పూల్ ఆవరణలో నిర్వహించబడుతుంది. ఈ మట్టి స్నానమునందు, వ్యాయామ యోగ, సూక్ష్మక్రియయోగ, అంతరంగ యోగ,ధ్యానయోగ తదితర వాటిలో శిక్షణ ఇవ్వబడునని యోగచార్యులు సిద్దిరాములు తెలిపారు.ఆసక్తి గలవారందరూ రాగలరని అయన కోరారు.పూర్తి వివరాలకు గురూజీ 9440408078, 9700232527,Y.వినోద్ కుమార్ 7670938545,నవీన్ 9440659507, భూమయ్య 9059766326,B.శ్రీనివాస్ 9440313306,ఆడెపు శ్రీనివాస్ భైంస 9440542221 నంబర్లకు సంప్రదించాలని తెలిపారు.