బంగారు పతకాలు సాధించిన జిల్లా కరాటే క్రీడాకారులు
– తెలంగాణ పిసిసి మహేష్ గౌడ్ అభినందనలు
నిజామాబాద్ అర్బన్, సెప్టెంబర్ 20 ( లోకంతీరు ) : ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన తొలి ఎసియన్ తైక్వాండో ఛాంపియన్ షిప్ కరాటే పోటిల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లో గల టైమ్స్ స్కూల్ విద్యార్థులైన కరాటే క్రీడాకారులు నిహాల్, సైనిక్ చంద్ర, ప్రణవ్ గౌడ్, పంకజ పాటిల్ జూనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో రెండేసి బంగారు పతకాలను సాధించారు. వీరిని టి పి సిసి అధ్యక్షుడు,సీనియర్ కరాటే మాస్టర్ బి. మహేష్ కుమార్ గౌడ్ అభినందించారు. అలాగే బంగారు పతకాలు సాధించేందుకు కృషి చేసిన కరాటే కోచ్ మాస్టర్ హిరా లాల్ కు,మాస్టర్ సాకెత్ ను కూడా అభినందించారు. ఈ కార్యక్రమం లో స్కూల్ మానేజ్మెంట్ కరస్పండెంట్ వినోద్ గౌడ్, యామిని, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.