సహకార వారోత్సవాల సందర్భంగా పతక ఆవిష్కరణ
ఎడపల్లి, నవంబర్ 14 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం లోని జానకంపెట్ ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సహకార వారోత్సవాల సందర్భంగా పతాక ఆవిష్కరణ చేపట్టారు.ఈ సందర్భంగా సంగం అధ్యక్షులు మిద్దె నరేందర్,పోలమల్కడ్డి మాట్లాడుతూ,నిజామాబాద్ జిల్లా. ల్లోని సహకార సంఘాలలో సహకార వారోత్సవాలలో భాగంగా డి సి ఓ ఆదేశాల మేరకు సహకార వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సహకార జెండా ఆవిష్కరణ అదేవిధంగా రైతులు సహకార సంఘాల ద్వారా ఎంతో ప్రయోజనం పొందుతున్నారని, భవిష్యత్తులో కూడా రైతులు సహకార సంఘాలకు సహకారం అందించి సహకార సంఘాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. రైతులకు సహకార సంఘాలు ఎల్లవేళలా ఎటువంటి సహకారం అందించడానికైనాసిద్ధంగాఉంటాయని వారు తెలిపారు. సహకార సంఘాల అభివృద్ధికి పాలకవర్గంతో పాటు రైతులు, గ్రామ పెద్దలుసహకరించాలని వారు కోరారు కార్యక్రమంలో సహకార సంఘం కార్యదర్శులు గంగారెడ్డి, రాజారాం, డైరెక్టర్లు గద్ద సాయిలు , బిల్లా సాయిలు,, ఓర్సు సాయిల, గ్రామ పెద్దలు, చిలుక నారాయణ, డాక్టర్ రాజలింగం, రేకులపల్లి రవి, ఓర్సు యాదగిరి, నర్సారెడ్డి, జబ్బర్, సిబ్బంది నరసయ్య ప్రవీణ్, ఏడ పల్లి సంఘ ఉపాధ్యక్షులు అనిల్ రెడ్డి, పాలకవర్గం బాధ్యులు సిబ్బంది ప్రభాకర్ గౌడ్, రావి చెట్టు కింది సురేష్, శ్రీనివాస్, జగన్ రైతులు తదితరులు పాల్గొన్నారు.