తెలంగాణలోనే దసరా తరువాత ఐదు రోజులకు బతుకమ్మ పండుగ
ఎడపల్లి, సెప్టెంబర్ 21 ( లోకంతీరు ) : దసరా తర్వాతే బతుకమ్మ పండుగ ఎక్కడో మీకు తెలుసా నిజామాబాద్ జిల్లా ఎడపల్లి గ్రామంలో ప్రజలు బతుకమ్మను దసరా తర్వాత ఐదు రోజులకు నిర్వహిస్తారు నిజం పాలనలో దేశ్ ముఖ్ వ్యవస్థలో పూర్వికులుఎడపల్లి గ్రామంలో పండగను గడి వద్ద నిర్వహించేవారు నిమజ్జనానికి బయలుదేరే క్రమంలో సిపాయి గాల్లోకి కాల్పులు జరపడం ఆనవాయతి గా అయితే ఒకసారి తుపాకి ప్రమాదవశత్తు పేలి సిపాయి మరణించాడు ఈ దుర్ఘటనతో దసరా తర్వాత దసరా తర్వాత బతుకమ్మను జరుపుకోవడం మొదలుపెట్టారు నేటికీ తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఎడపల్లి గ్రామానికి చెందిన ప్రజలుఆనవాయితీ పాటించడం సాంప్రదాయంగా కొనసాగుతుంది కనుక ఎడపల్లిలో బతుకమ్మ పండుగను చూడడానికి ఆడపడుచులు అధిక సంఖ్యలో పాల్గొని బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుతారు ఎడపల్లి గ్రామ ప్రజలు అందరు కలిసి భాజా భజంత్రీల మధ్యబతుకమ్మలను ఒకే చెరువులో వేయడం ఇక్కడి ప్రత్యేకత