Take a fresh look at your lifestyle.

రంగరాజన్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి…..

0

రంగరాజన్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

– బ్రాహ్మణ వికాస పరిషత్ మండల అధ్యక్షుడు జ్యోషి శ్రీధర్ శర్మ 

ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 12 ( లోకంతీరు ) : సంగారెడ్డి జిల్లా చిలుకూరు మండలం చిలుకూరు వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై జరిగిన దాడి అమానుషమని బ్రాహ్మణ వికాస పరిషత్ మండల అధ్యక్షులు జ్యోషి శ్రీధర్ శర్మ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రామరాజ్యం అనే పేరుతో వీర రాఘవరెడ్డి సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ పేరుతో చాలామందిని బెదిరింపులకు గురి చేస్తూ అనేక చట్ట వ్యతిరేక కార్యకారపాలకు పాల్పడ్డ అయినా చిలుకూరు బాలాజీ ప్రధాని అర్చకులు రంగరాజన్ పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సనాతన ధర్మ పరిరక్షణకు అంకితభావంతో సేవలు అందిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తున్న రంగరాజన్ పై దాడి అమానుషమని ఈ దాడిని సనాతన ధర్మంపై జరిగిన దాడిగా భావిస్తున్నామని అన్నారు. హిందూ సంఘాల పేరుతో దాడులు చేయడం హేమమైన చర్య అని పేర్కొన్నారు. రామరాజ్యం సంస్థ పేరుతో రాష్ట్రంలో ఆశాంతిని సృష్టిస్తూ రావణ రాజ్యం చేయాలనుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ముత్యాల శ్రీనివాసరావు, కోశాధికారి పటేల్ నరసింహారావు, ఉపాధ్యక్షులు కొండంబట్ల రాజేశ్వర్ శర్మ, సహాయ కార్యదర్శులు కృష్ణమూర్తి, భీమ్ రావు, శ్రీనివాసరావు, లక్ష్మణరావు, శంకర్ రావు, ముత్యాల సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.