Take a fresh look at your lifestyle.

ఎడపల్లి మండల కేంద్రంలోనీ రెండవ అంగన్వాడి కేంద్రంలో అర్ధరాత్రి చోరీ….

0

ఎడపల్లి మండల కేంద్రంలోనీ రెండవ అంగన్వాడి కేంద్రంలో అర్ధరాత్రి చోరీ

ఎడపల్లి, అక్టోబర్ 04 ( లోకంతీరు ) : ఏడపల్లి మండల కేంద్రంలోని రెండవ అంగన్వాడి కేంద్రంలో గత రాత్రి చోరీ జరిగింది. స్థానిక మండల విద్యాశాఖ కార్యాలయం పక్కనే ఉన్న అంగన్వాడి కేంద్రంలో గుర్తు తెలియని దొంగలు తాళాలు పగలగొట్టి లోపల ఉన్న 25 కిలోల పైగా బియ్యం,16 పాల ప్యాకెట్లు,200 కోడిగుడ్లు, పప్పులో మురుకులు ఎత్తుకొని పోయారు.శనివారం ఉదయం అంగన్వాడీ టీచర్ కృష్ణ తులసి తలుపులు పగలగొట్టి ఉన్న విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.సంఘటన స్థలాన్ని మండల విద్యాశాఖ అధికారి శివ లింగ్గాలప్ప, ఐసిడిఎస్ ఎడపల్లి మండల పర్యవేక్షకురాలు సావిత్రి పరిశీలించారు. అందిన ఫిర్యాదు మేరకు ఎడపల్లిపోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ముత్యాల రమ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.