అంబరంగ వైభవంగాఎడపల్లి బతుకమ్మ సంబరాలు

ఎడపల్లి, అక్టోబర్ 04 ( లోకంతీరు ) : ఎడపల్లి మండల కేంద్రంలో శనివారం సద్దుల బతుకమ్మ వేడుకలను మహిళలు అంగరంగ వైభవంగా ఘనంగా జరుపుకున్నారు. బతుకమ్మలను తమ వాకిళ్ళ ముందర దేవాలయాల వద్ద బతుకమ్మ ను గ్రామస్తులందరూ పెట్టిబతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆడుతు పాడుతుసంబరాలు జరుపుకున్నారు. గ్రామంలోని రామారావు దేశముఖ్ గడి నుంచి భాజా భజంత్రీలతో మహిళలు బతుకమ్మలను పట్టుకునిదాస్ హనుమాన్ వద్ద ఒకచోట పేర్చి గొబ్బియలాటఆడారు.బతుకమ్మలను పట్టుకొని ఊరేగింపు(శోభాయాత్ర ) ద్వారా ఎడపల్లి గ్రామ శివారులో గల బతుకమ్మ చెరువు వద్ద వేద పండితులు పూజలు నిర్వహించిన అనంతరంభక్తిశ్రద్ధలతో బతుకమ్మలను ఆడపడుచులునిమజ్జనంచేశారు. గ్రామపంచాయతీ కార్యదర్శి బతుకమ్మ చెరువు వద్ద భక్తులకు ఇబ్బంది కాకుండా అన్ని ఏర్పాట్లు నిర్వహించారు వివిధ పార్టీ రాజకీయ నాయకులు భక్తులకు వాటర్ బాటిల్ పంపిణీ చేశారు మహిళ పోలీసులు దారి పొడవున మహిళలకు రక్షణగా నిలిచారు. వాహనాలను క్రమబద్దీకరణ చేయడంలో పోలీసులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఎడపల్లిఎస్సై ముత్యాల రమ పర్యవేక్షణ చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు బతుకమ్మ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది.