స్థానిక ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బస్ షెల్టర్ కు రంగులు వేయించారు
ఎడపల్లి, అక్టోబర్ 04 ( లోకంతీరు ) : బోధన్ _నిజామాబాద్ ప్రధాన రహదారి ఎడపల్లి మండల కేంద్రంలోని రిక్వెస్ట్ బస్ షెల్టర్ ను స్థానిక ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అక్టోబర్ 10/2017 సంవత్సర కాలంలో ఏర్పాటు చేశారు.స్థానికులు, పాఠశాల, కళాశాలలోచదివేవిద్యార్థిని విద్యార్థులు, గ్రామస్తులు పట్టణ ప్రాంతాలకు వెళ్లేందుకు విలుగా ప్రయాణికుల సౌకర్యమేరకు బస్ షెల్టర్ నునిర్మించారు.సుమారు 8 సంవత్సరాల కాలం అవుతుంది.బస్ షెల్టర్కుశనివారం స్థానిక ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలోరంగులు వేయించారు.ఇందులోప్రయాణికులు కూర్చోడనికి సిమెంట్ బల్లాలను ఏర్పాటుచేశారు.బోధన్_నిజామాబాద్ పట్టణ ప్రాంతాలకువెళ్లేప్రయాణికులకు వాన, చలి, ఎండ నుంచి రక్షణతో పాటుసౌకర్యాలుకల్పించినందుకు ఎడపల్లి యువకులు, పెద్దలు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తూ స్థానిక ఉద్యోగుల సంఘం ప్రతినిధులనుఅభినందిస్తున్నారు. స్థానిక ఉద్యోగులసంఘం అధ్యక్షులు పెరిక రాజలింగం,గంగాధర్, సంఘం ప్రతినిధులురంగులువేయించిన వారిలోఉన్నారు.