Take a fresh look at your lifestyle.

బోధన్ డివిజన్ పరిధిలో నేడు విద్యుత్ అంతరాయం…….

0

బోధన్ డివిజన్ పరిధిలో నేడు విద్యుత్ అంతరాయం

ఎడపల్లి, అక్టోబర్ 17 ( లోకంతీరు ) : బోధన్ డివిజన్ పరిధిలోని 33/11 కె.వి.ఎస్.ఎస్ సబ్స్టేషన్ లలో మూడవ శనివారం సందర్భంగా మరమ్మత్తుల పనులు చేపడుతున్నందున శనివారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి 5 గంటల వరకు రెండు గంటలపాటు విద్యుత్ అంతరాయం ఉంటుందని బోధన్ సబ్ డివిజనల్ ఏ డి ఈ నాగేశ్వరరావు తెలిపారు. బోధన్ రూరల్ పరిధిలోని చిన్న మావంది, ఎడపల్లి మండల పరిధిలోని ఏ ఆర్ పి క్యాంప్, రెంజల్ మండల పరిధిలోని నీల సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ మరమ్మత్తు పనులు చేపడుతున్నందున కరెంటుకు అంతరాయం ఉంటుందని తెలిపారు. రైతులు, విద్యుత్ వినియోగదారులు సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు, సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.

Leave A Reply

Your email address will not be published.