ఎడపల్లి గ్రామానికి చెందిన కంటేడి గంగాధర్ నేత్ర దానం
ఎడపల్లి, అక్టోబర్ 17 ( లోకంతీరు ) : ఎడపల్లి గ్రామానికి చెందిన కంటెడి గంగాధర్ (60) మృతి చెందారు.తన మరణాంతరం నేత్రాలను దానం చేసి ఇతరులకు చూపునిస్తానని గతంలో లయన్స్ ప్రతినిధులకు తెలిపారు.శుక్రవారం ఆయన మరణించడంతో లయన్స్ కంటి ఆసుపత్రికి నేత్రాలను దానం చేసినట్లు లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి ప్రతినిధులు తెలిపారు.ఈ సందర్భంగా గంగాధర్ మృతి పట్ల లయన్స్ క్లబ్ ప్రతినిధులు గంగాధర్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తపరచారు..