Take a fresh look at your lifestyle.

వడ్డేపల్లి లో ఇంటింట ఎన్నికల ప్రచారం……

0

వడ్డేపల్లి లో ఇంటింట ఎన్నికల ప్రచారం

– ఫుట్బాల్ గుర్తుకే ఓటెయ్యండి

ఎడపల్లి, డిసెంబర్ 08 ( లోకంతీరు ) :  ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామ పంచాయతీ పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థి మెట్టు రేఖ గోవింద్ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు.సోమవారం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.ఇంటింట తిరుగుతూ ఫుట్బాల్ గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి తనని గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు గ్రామంలోని ఒకటో, రెండో, మూడో వార్డులలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.అవకాశం ఇయ్యండి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దుతా, గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారానికి తన వంతు ఎల్లవేళల కృషి చేస్తానని ఓటర్లకు ఆమె హామీ ఇచ్చారు. ప్రచార కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ ఆంజనేయులు, యువకులు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.