బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సుదర్శన్ రెడ్డికి ఘనంగా సన్మానం
ఎడపల్లి, నవంబర్ 04 ( లోకంతీరు ) : బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా నియామకం చేయడం హర్షణీయమని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బిల్లా రామ్మోహన్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యే ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి, వైద్య విద్య, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధితోపాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎంతగానో అభివృద్ధి చేశారని ఆయన అన్నారు. జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం వల్ల ఎంతోమంది విద్యార్థులకు బంగారు భవిష్యత్తు వచ్చిందని కొనియాడారు. అలాగే రైతుల కొరకు ఎత్తిపోతల పథకం నిర్మాణం పనులు చేపట్టి రైతులను ఆదుకున్న ఘనత ప్రభుత్వ సలహాదారునికే తగ్గిందన్నారు. అలాగే బోధన్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారునిగా నియమించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రులకు ఎంపీలకు ఎమ్మెల్యేలకు, బిల్లా రామ్ మోహన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందుగా ప్రభుత్వ సలహాదారునిగా నియామకమైన పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి ఘనంగా సన్మానించిపువ్వులబొక్కే అందించి శుభాకాంక్షలు తెలిపారు.