కుర్నాపల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సుదర్శన్ రెడ్డికి ఘనంగా సన్మానం
ఎడపల్లి, నవంబర్ 04 ( లోకంతీరు ) : మాజీమంత్రి, బోధన్ నియోజక వర్గ శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ సలహాదారుని గా క్యాబినెట్ హోధా కలిగిస్తూ నియామకం చేయడం పట్ల ఎడపల్లి మండలం కుర్నపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ హైదరాబాదులోని ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి నివాసంలో ప్రభుత్వ సలహాదారునికి శాలవతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ్ర సంజయ్, ఎడపల్లి సహకార సంఘం ఉపాధ్యక్షులు గాంధారి అనిల్ రెడ్డి, నాయకులు గాంధారి హనుమంత్ రెడ్డి, పరిగే సాయిలు, రాజా గౌడ్, గాండ్ల గంగాధర్, కొప్పుల చంద్రశేఖర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.