Take a fresh look at your lifestyle.

బాన్సువాడ పిఎస్ కానిస్టేబుల్ బి శ్రీను సస్పెండ్…..

0

బాన్సువాడ పిఎస్ కానిస్టేబుల్ బి శ్రీను సస్పెండ్

ఎడపల్లి, నవంబర్ 09 ( లోకంతీరు ) :  బాన్సువాడ పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ బి. శ్రీనును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు నవంబర్ 6.. 2025 న బాన్సువాడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన జూదం కేసులో 09 మంది నిందితులను అదుపులోకి తీసుకొని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారు నిందితులకు విధించిన జరిమానా వసూలు ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఎస్పీ దృష్టికి రావడంతో బి శ్రీను కానిస్టేబుల్ పైన క్రమశిక్షణత్మక చర్యలు ప్రారంభించాలని నిర్ణయించారు తెలంగాణ సివిల్ సర్వీస్ రూల్స్ 1991 ప్రకారం ఎస్పీ కానిస్టేబుల్ ను తక్షణమే సస్పెండ్ చేశారు సస్పెన్షన్ కాలంలో కానిస్టేబుల్ ప్రధాన కార్యాలయం బాన్సువాడగానే ఉంటుంది అని మరియు ముందస్తు అనుమతి లేకుండా ఆ స్థలాన్ని విడిచి వెళ్లరాదు అని ఈ ఉత్తర్వులు బాన్సువాడ ఎస్ హెచ్ ఓ కు ఎస్పీ ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.