Take a fresh look at your lifestyle.

అత్యాచారయత్నం ఘటనలో దోషులందరినీ శిక్షించాలి…..

0

అత్యాచారయత్నం ఘటనలో దోషులందరినీ శిక్షించాలి

    • పూజ హాస్పిటల్ ను వెంటనే సీజ్ చేయాలి

    • ఆసుపత్రిలో జరిగిన చికిత్సలపై సమగ్ర దర్యాప్తు జరపాలి

    • సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ డిమాండ్   

నిజామాబాద్ , డిసెంబర్ 24  ( లోకంతీరు)  : జిల్లా కేంద్రంలోని ఖలీల్ వాడి లో గల పూజ హాస్పిటల్ లో యువతిపై అత్యాచారయత్నం చేసిన దినేష్ అతని స్నేహితులను అరెస్టు చేసి చట్ట ప్రకారం శిక్షించాలని, పూజ హాస్పిటల్ లో జరిగిన చికిత్సలపై ఆస్పత్రి నిర్వాహకుడు శ్రీనివాస్ రెడ్డి కార్యకలాపాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఏవో కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ నగర కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ నగరంలోని ఖలీల్ వాడిలో గల పూజ హాస్పిటల్ లో నర్స్ గా పనిచేస్తున్న యువతిపై ఈనెల 22న రాత్రి రోహిత్ అనే యువకుడు అత్యాచారయత్నం చేశాడన్నారు. రోహిత్ కు అతని స్నేహితులు దినేష్, హన్మండ్లు, వాచ్ మెన్ సహకరించారన్నారు. వీరందరూ ఆసుపత్రి నిర్వాహకుడు శ్రీనివాస్ రెడ్డి అనుచరులన్నారు. అయితే రోహిత్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అతనికి సహకరించిన వారిని కేసు నుంచి తప్పించారన్నారు. వెంటనే రోహిత్ అతని మిత్రులపై కేసులు నమోదు చేసి, అరెస్టు చేయాలన్నారు.పూజ హాస్పిటల్ నిర్వాహకుడు శ్రీనివాసరెడ్డి పై అనేక ఆరోపణలు ఉన్నాయన్నారు. గత కొన్ని నెలలుగా పూజ హాస్పిటల్ లో నిబంధనలకు విరుద్ధంగా ఆపరేషన్లు నిర్వహిస్తున్నారనే ప్రచారం ఉందన్నారు. బ్రూన హత్యలు సైతం జరిగాయని ఆరోపణలు ఉన్నాయన్నారు. గత ఐదారు నెలలుగా పూజ ఆసుపత్రిలో జరిగిన అన్ని శస్రచికిత్సలపై సమగ్ర దర్యాప్తు జరపాలన్నారు. తక్షణమే ఆసుపత్రిని సీజ్ చేసి, రికార్డులను స్వాధీనం చేసుకోవాలన్నారు.వైద్య విద్యను చదవకున్నా, కొద్దిమంది పార్ట్ టైం డాక్టర్లను పెట్టుకుని ఆస్పత్రులను నిర్వహిస్తున్న వారు యదేచ్చగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారన్నారు. వీటన్నింటిపై జిల్లా వైద్యాధికారులు స్పెషల్ డ్రైవ్ చేయాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు.పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కే.సంధ్యారాణి మాట్లాడుతూ సమాజంలో మహిళలకు భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. పని చేస్తున్న ఆసుపత్రిలో సైతం రక్షణ లేకపోవడం దారుణమన్నారు. పూజ హాస్పిటల్ లో నర్సుగా పనిచేస్తున్న యువతిపై అత్యాచారం చేసిన రోహిత్, అతనికి సహకరించిన మిత్రులను వెంటనే అరెస్టు చేయాలన్నారు. ఆడపిల్లలను గర్భంలోనే చిదిమేస్తున్న, భ్రూణ హత్యలను నివారించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. భ్రూణహత్యలకు పాల్పడుతున్న పూజా హాస్పటల్ ను వెంటనే సీజ్ చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు సాయిబాబా పీ.డీ.ఎస్.యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.అనిల్ కుమార్, మాస్ లైన్ నగర నాయకులు విటల్, అమూల్య, బుజ్జినాగూర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.