తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు కలెక్టరేట్ల ముందు ధర్నాలు
ఎడపల్లి, నవంబర్ 10 ( లోకంతీరు ) : నేడు ఉదయం 10 గంటలకు బోధన్ సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్దకు నిజాంబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా మార్చాలని జీవో 34 ను వెంటనే అమలు చేయాలనిఅందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నిజాంబాద్ జిల్లా కమిటీ పిలుపు ఇస్తుంది రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజాంబాద్ జిల్లా గౌరవ అధ్యక్షులు రమేష్ బాబు, జిల్లా అధ్యక్షులు గైని రాములు, యేషాల గంగాధర్ జిల్లా కార్యదర్శి 9010585377 ఫోన్ నెంబర్ కు సంప్రదించి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న వికలాంగులు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.