Take a fresh look at your lifestyle.

రోడ్డు భద్రత, సైబర్ దొంగతనాల గురించి అవగాహన….

0

రోడ్డు భద్రత, సైబర్ దొంగతనాల గురించి అవగాహన

ఎడపల్లి, నవంబర్ 22 ( లోకంతీరు ) :  నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి.సాయి చైతన్య. ఐపీఎస్ ఆదేశాల మేరకు, నిజామాబాద్ పోలీస్ కళా బృందం ఆధ్వర్యంలో బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ జూనియర్ కాలేజ్ బోధన్ నందు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది . ఈ సందర్భంగా విద్యార్థుల కు నాటికలు, పాటల రూపంలో వివిధ సామాజిక అంశాలపై విలువైన సందేశాలు అందించడం జరిగింది .రోడ్డు భద్రతపై అవగాహన హెల్మెట్ ధరించండి హెల్మెట్ బరువు కాదు, ఇది బాధ్యత జీవించు, జీవించనివ్వు రోడ్డు భద్రత నియమాలు సైబర్ దొంగతనాల గురుంచి అవగాహన.డ్రగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోధన్ టౌన్ సిబ్బంది స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు కళాబృందం సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.