కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ఆశయాల సాధనకై ఉద్యమిద్దాం

నిజామాబాదు, జులై 16 ( లోకంతీరు న్యూస్ ) : సీపీఐ(ఎం.ఎల్)మాస్ లైన్ జాతీయ నాయకులు, కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ 2వ వర్ధంతి సందర్భంగా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కోటగల్లి ఎన్.ఆర్ భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ నిజామాబాద్ అర్బన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ కామ్రేడ్ చంద్రశేఖర్ మరణం పార్టీకి, విప్లవోద్యమానికే కాకుండా, పీడిత వర్గాలకు ఎనలేని లోటన్నారు. కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ సోదరులు నలుగురూ విప్లవోద్యమానికి తమ జీవితాలను త్యాగం చేశారని కొనియాడారు. కామ్రేడ్ చంద్రశేఖర్ అనేక సంవత్సరాలు అజ్ఞాతదళ జీవితం గడిపారున్నారు. అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా, సంయుక్త కిసాన్ మోర్చా సభ్యుడుగా రైతాంగ పోరాటాల్లో, ఇటీవల కాలంలో జరిగిన దేశవ్యాప్త రైతు ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించాడన్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విప్లవోద్యమ నిర్మాణంకోసం ఎనలేని కృషి చేశారన్నారు. పీడితజన విముక్తికోసం, సమ సమాజం కోసం ఉద్యమించిన కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ఆశయాల సాధనలో పయనించడమే కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ కు నిజమైన నివాళి అవుతుందన్నారు.,ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు ఎం.నరేందర్, డివిజన్ కార్యదర్శి ఎం.వెంకన్న, నగర కార్యదర్శి ఎం.సుధాకర్, పీ.ఓ.డబ్ల్యు జిల్లా అధ్యక్షులు గోదావరి, పీ.డీ.ఎస్.యూ జిల్లా అధ్యక్షులు కే.గణేష్, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు సాయిబాబా, టీయుసీఐ జిల్లా నాయకులు లింగం, నర్సక్క, గంగాధర్, పీ.డీ.ఎస్.యూ నగర అధ్యక్ష కార్యదర్శులు నసీర్, వినోద్ ఉపాధ్యక్షులు సృజన్, మనితేజ, శ్రీశాంత్ తదితరులు పాల్గొన్నారు.