Take a fresh look at your lifestyle.

తల్లిదండ్రుల వయోవృద్ధుల సంరక్షణ చట్టంపై అవగాహన …..

0

తల్లిదండ్రుల వయోవృద్ధుల సంరక్షణ చట్టంపై అవగాహన 

ఎడపల్లి, నవంబర్ 22  ( లోకంతీరు ) :  జడ్.పి.హెచ్.ఎస్ తానా కలాన్ పాఠశాల ప్రాంగణంలో తల్లిదండ్రుల మరియు వయోవృద్ధుల రక్షణ మరియు పోషణ సంక్షేమ చట్టంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయబడింది.ఈ సమావేశం పరమేశ్వర్ పీజీహెచ్ఎం అధ్యక్షతన జరిగింది. పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. కుటుంబంలోని అనుబంధాలు పటిష్టంగా ఉండేవి. మారుతున్న నేటి కాలంలో విలువలు అంతరించి కుటుంబంలోని అనుబంధాలు చిన్నాభిన్నమై వృద్ధులు నిరాదారులవుతున్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎడపల్లి మండలం పి విశ్వనాథం స్టేట్ జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ కనిపించిన తల్లిదండ్రులను ఆస్తులను రాయించుకొని వీధిలోకి గెంటేస్తున్నారని వారిని గౌరవంగా ప్రేమగా చూసుకోవాలి అని విద్యార్థులకు వివరించారు.ఎడపల్లి మండలం పి రాజలింగం జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ తల్లిదండ్రులకు అన్యాయం చేసిన వారి నుండి 2007 ఏ సిటీ ప్రకారం పిల్లలపై వారి వారసులపై కేసు వేసి వృద్ధులకు సముచిత స్థానం లభించేలా ప్రభుత్వం వారు చట్టాలను ఏర్పాటు చేశారని తెలియజేశారు డాక్టర్ బి.ఆర్ గైక్వాడ్ సీనియర్ సిటిజన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నిజామాబాద్ వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు ముందుగానే ఆస్తులను పిల్లలకు రాసి ఇవ్వవద్దని, ఆస్తి రాగానే తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారని తెలుపుతూ మీ దృష్టిలో ఇటువంటి సంఘటనలు జరిగినట్లయితే చూపినట్లయితే ఆ వివరాలను తమకు తెలుపవలసిందని కోరారు. చట్టపరమైన న్యాయం కోసం పోరాడుతామని కూడా తెలియజేశారు. సభాధ్యక్షులు పరమేశ్వర్ పి జి హెచ్ ఎం మాట్లాడుతూ తల్లిదండ్రులను గౌరవంగా చూసుకోవాలని , మనలను కనిపెంచిన తల్లిదండ్రులను, తల్లిదండ్రులను ఇచ్చిన అమ్మమ్మ,తాత,నానమ్మ, తాతలను ప్రేమగా చూసుకుంటూ వారి అవసరాలను తీర్చాలని, సేవలు చేయాలని అది పిల్లల కర్తవ్యం అని తెలియజేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని అప్పుడే సమాజం బాగుపడుతుందని చంద్రమౌళి వృద్ధాశ్రమాలు లేనటువంటి సమాజం ఏర్పడాలని తల్లిదండ్రులను పెద్దలను గౌరవించాలని, ఆ భావం చిన్ననాటి నుండే అలవర్చుకోవాలని హరిప్రియ తెలియజేశారు.మన గ్రామంలో ఇంకెక్కడైనా వృద్ధులను సరిగ్గా చూసుకోక పోయినట్లయితే  చట్టం ద్వారా న్యాయం పొందవచ్చు అనే విషయాన్ని అందరికీ తెలియజేయాలని ఉపాధ్యాయులుసత్య ప్రకాష్ శ్రీనివాస రావు సుధాకర్ నరసయ్య పి ఈ టిప్రసాద్ కల్లెడ శ్రీనివాస్ తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.