Take a fresh look at your lifestyle.

ఇసుక అక్రమ తరలింపు ….

0

ఇసుక అక్రమ తరలింపు 

– ఫిర్యాదు చేసిన పట్టించుకోని వైనం

– పి ఎ అండదండలతో విచ్చలవిడిగా వ్యవహారం?

– పట్టించుకోని అధికారులు

– కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు లాగ్యల ప్రసాద్

కామారెడ్డి, నవంబర్ 22 ( లోకంతీరు ) : రామారెడ్డి మండల కేంద్రంలో శనివారం ఇందిరమ్మ లబ్ధిదారుల పేర్లతో మండల తాసిల్దార్ కార్యాలయంలో అనుమతులు తీసుకొని మండల కేంద్రానికి చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు అనుమతి తీసుకున్న వారికి పోయకుండా వేరే వారికి ఇసుకపోవడం ఎంతవరకు సమన్యసం అని మరియు ఇసుక అక్రమంగా వేరే వారికి పోస్తున్నారని రామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు లాగ్యల ప్రసాద్ మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబయి ప్రసాద్,రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. అనంతరం అధికారులకు మరియు పోలీస్ సిబ్బందికి సమాచారం ఇచ్చిన అంటి అంటున్నట్టు వ్యవహరించిన తీరును బట్టి కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు లగ్యల ప్రసాద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చెడ్డపేరు తెస్తున్న కార్యకర్తలను గుర్తించి శాసనసభ్యులు మదన్మోహన్ వారిపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి అంబాయి ప్రసాద్, మరియు లాగ్యల ప్రసాద్ ఎమ్మెల్యేకి విన్నవించడం జరిగింది. మండలంలో పి ఏ ల తీరును బట్టి మండల ప్రజలు మరియు ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు అదేవిధంగా ఇలాగే కార్యకలాపాలు జరిగితే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మండలంలో కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేదని బహిరంగ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.