Take a fresh look at your lifestyle.

ఎన్నికల కోడ్ కూసింది..!

0

ఎన్నికల కోడ్ కూసింది..!

  • నగదు పై జాగ్రత్త

  • ఆదమరిస్తే అంతే..!

  • అధిక నగదుకు పత్రాలు తప్పనిసరి

  • ప్రభుత్వా నిబంధనలు బేషారత్

కామారెడ్డి , నవంబర్ 25 ( లోకంతీరు ) : అమల్లోకి ఎన్నికల కోడ్ మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఈసీ ప్రకటించిన విషయం తెలిసినదే. అయితే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల వద్ద మించి ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా సీజ్..! చేస్తారు.తెలంగాణ పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల నాగార మోగుతున్న తరుణం.రాష్ట్ర ఎన్నికల సంఘం ఐదు దశల్లో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మూడు విడతలుగా ఎన్నికల ప్రక్రియను నియమించనున్నట్లు ప్రభుత్వం తేదీలను ఖరారు చేసింది. నేటి నుంచే ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి కోడ్ ముగిసే వరకు రూ. 50 వేలకు మించి నగదు తీసుకెళ్లడం పై నిబంధనలు సరైన పత్రాలు లేని నగదును అధికారులు సీజ్ చేసి, ఐటీ అధికారులకు అందిస్తారు. నగదు ఉన్నట్లయితే ప్రజలు తగిన ఆధారాలు వెంట ఉంచుకోవాలని సూచించారు.
తెలంగాణ పల్లెల్లో ఎన్నికల హడావిడి వాడి వేడిగా ప్రారంభమైంది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేశారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 565 మండలాల్లో మొత్తం ఐదు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ప్రక్రియ నవంబర్ 27 నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఎలక్షన్ కమిషన్ మెుత్తం ఐదు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీడీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రక్రియ మొదటి విడత నవంబర్ 27 నామినేషన్ల స్వీకరణ, రెండో విడత నామినేషన్ల స్వీకరణ నవంబర్ 30, మూడో విడత డిసెంబర్ మూడవ తేదీ నామినేషన్ స్వీకరిస్తారు. తదుపరి డిసెంబర్ 11న మొదటి విడత పోలింగ్ జరగనుంది. తదుపరి రెండవ విడత పోలింగ్ డిసెంబర్ 14 తో, మూడో విడత పోలింగ్ ప్రక్రియ డిసెంబర్ 17 తో స్థానిక ఎన్నికలు ముగియనున్నాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచే ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుంది.ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ఆంక్షలు ఉంటాయి. ఎన్నికల సందర్భంగా అక్రమ నగదు రవాణా అరికట్టేందుకు అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తారు. నేటి నుంచి ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఒక సామాన్య వ్యక్తి రూ. 50 వేల వరకు మాత్రమే నగదు బహిరంగంగా తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది. ఎన్నికల కమిషన్ సూచించిన దానికంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా, సరైన పత్రాలు లేకపోతే ఆ నగదును అధికారులు సీజ్ చేస్తారు. అదేవిధంగా ఉమ్మడిగా కార్లలో గాని ఆటోలో గానీ వెళ్తున్న తరుణంలో చెకింగ్ లో భాగంగా నగదు 50 వేలకు మించి ఉంటే అట్టి సొమ్మును సీజ్ చేసే అవకాశం కూడా ఉంది.? అవసర నిమిత్తమై ఆరోగ్య రీత్యా గాని, లేదా ఇతరత్రా అవసరాల కొరకు నగదును తీసుకువెళ్లే వలసిన సమయం సందర్భంలో ఈ నగదుకు సంబంధించిన పత్రాలను వెంబడవుంచుకోవాలని ఈసీ కమిషన్ తెలపడం జరిగింది.ఎక్కువ మొత్తంలో నగదు దొరికితే.. ఎన్నికల అధికారులు ఐటీ జీఎస్టీ అధికారులకు సమాచారం అందించి ఆ డబ్బును కోర్టులో జమ చేస్తారు. తక్కువ మొత్తంలో దొరికిన డబ్బును రెవెన్యూ అధికారుల వద్ద జమ చేస్తారు. ప్రజాప్రతినిధులు, సాధారణ ప్రజలు ఎన్నికల నిబంధనలను పాటించాలని, అనవసర ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నగదుకు సంబంధించిన తగిన ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలని అధికారులు పలు రకాల సూచనలు చేయడం జరుగుతుంది.సరైన పత్రాలు ఉంటేనే అనుమతి
అత్యవసర వైద్యం, కళాశాల ఫీజులు, వ్యాపారం, పెళ్లిళ్లు వంటి ముఖ్యమైన అవసరాలకు పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లే వారు తప్పనిసరిగా సరైన ఆధారాలు వెంట ఉంచుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.ఈ పత్రాలను చూపించగలిగితే జప్తు చేసిన డబ్బును తిరిగి ఇస్తారు.

అధికారులకు చూపించాల్సిన ఆధారాలు..!

బ్యాంకు లావాదేవీల్లో నగదు డ్రా చేసిన అకౌంట్ పుస్తకం లేదా ఏటీఎం స్లిప్,
వ్యాపార లావాదేవీల్లో వస్తువులు లేదా ధాన్యం విక్రయించిన డబ్బు అయితే దానికి సంబంధించిన బిల్లులు.
ఆస్తి లావాదేవీల్లో భూమి విక్రయించిన సొమ్ము అయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్లు,
వ్యాపారం లేదా సేవల ద్వారా వచ్చిన డబ్బు అయితే లావాదేవీల పూర్తి వివరాలు సమర్పించాలి. అని ఎలక్షన్ కమిషన్ ప్రజలకు ముందస్తుగా సమాచారం తెలపడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.