ఎడపల్లి జడ్పీ హెచ్ ఎస్ ప్రభుత్వ పాఠశాలకు విరాళం
-
పారిశ్రామికవేత్తలు ఏనుగు దయానంద్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

ఎడపల్లి , నవంబర్ 25 ( లోకంతీరు ) : ఎడపల్లిప్రభుత్వ పాఠశాలల్లో దీర్ఘకాలంగా ఉన్న సమస్యను గ్రామంతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులుతన ఉదారత చాటి సమస్యను పరిష్కరించడం అభినందనీయమని తాసిల్దార్ దత్తాత్రి అన్నారు. మంగళవారం ఎడపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ ఏనుగు దయానంద రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సుమారు 80 వేల రూపాయల వ్యయంతో మైక్ సెట్ అలాగే 50 కుర్చీలనుఅందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు కూడా ఇదే స్ఫూర్తితో పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అంటేనే నేడు మంచి అభిప్రాయం లేదని, ఇలాంటి సమయంలో దాతలు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు చేయూత అందించడం అభినందనీయమన్నారు. ప్రధానోపాధ్యాయుడు రవికుమార్ పాఠశాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను అభినందించారు. గ్రామస్తులతో మమేకమైతే ప్రభుత్వ పాఠశాలలు తీరు మరింత మెరుగుపడుతుందని అన్నారు. ఇటీవల పాఠశాలకు చేయూతను అందిస్తున్న పూర్వ విద్యార్థుల సహకారం మరువలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రవికుమార్, ఉపాధ్యాయులు సంజీవ్ కుమార్, విజయ్ కుమార్, శ్రీనివాస్ పవర్, పూర్వ విద్యార్థులు బంజ శంకర్, కంజర్ సత్యనారాయణ, విటల్, తదితరులు ఉన్నారు.