సైన్స్ విజ్ఞాన ప్రదర్శనలో ఎడపల్లి పాఠశాలకు ప్రథమ బహుమతి

ఎడపల్లి, నవంబర్ 26 ( లోకంతీరు ) : బోధన్ లోనిర్వహించిన జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ లో ఎడపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎకో కప్పు ప్రదర్శనలో రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. వ్యర్ధాలను తిరిగి ఉపయోగించే క్రమంలో కొబ్బరి టెంకలు తో తయారుచేసిన టీ కప్పుల ప్రదర్శన పలువురిని ఆకట్టుకుని రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు ఎంఈఓ గాలప్ప తెలిపారు. విద్యార్థులు దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి సైన్స్ ప్రదర్శనలు దోహదమవుతాయన్నారు. బుధవారం ఎడపల్లి పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను అభినందించారు. పాఠశాల తరఫున మూడు అంశాలను ప్రదర్శించగా భాగాల్లోనూ బహుమతులు లభించడం అభినందనీయం అన్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర స్థాయికి ఎంపికవడంలో విద్యార్థులకు గైడ్గా వ్యవహరించిన సైన్స్ ఉపాధ్యాయులు లచ్చిరాం, సంజీవ్ కుమార్ లను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రవికుమార్, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.