Take a fresh look at your lifestyle.

అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ దినోత్సవం…..

0

అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ దినోత్సవం

ఎడపల్లి, నవంబర్ 26 ( లోకంతీరు ) :  ఎడపల్లి మండల కేంద్రంలో బుధవారం రాజ్యాంగ దినోత్సవ సందర్భంగాఅంబేద్కర్ విగ్రహం వద్ద టీ ఎల్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు  డల్లా సురేశ్ మహాజన్ ,, అంబేద్కర్ యువజన సంఘం( ఏ వై ఎస్) అధ్యక్షుడు మెతరి గంగాధర్ భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రాజ్యాంగ దినోత్సవం ను ఘనంగా నిర్వహించడం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ సిడిసి చైర్మన్  శంకర్ నాయుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కండగట్ల రామచంద్రర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మచ్కురి  గంగాధర్, మండల కిసాన్ కేత్ అధ్యక్షులు శివరామ్ ప్రసాద్, రవీందర్ రెడ్డి, జక్కల నాగేష్, భాజపా నాయకులు మల్లెపూల శ్రీనివాస్, లక్ష్మణ్ గౌడ్, పేట గంగాధర్ అంబేద్కర్ సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టి ఎల్ ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డల్లా సురేశ్ మహాజన్ మాట్లాడుతూ విశాల భారత దేశం కోసం రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ గా డా.బాబా సాహెబ్ అంబేద్కర్ రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు అవిశ్రాంత కృషి వల్ల రచించిన రాజ్యాంగం ను 1949 నవంబర్ 26 న భారత రాజ్యాంగం ను రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన రోజును నూతన భారతదేశం గా ఆవిర్భావీస్తూ నాటి నుంచి భారత దేశ ప్రజలకు స్వేచ్ఛా, సమానత్వం, న్యాయం,సౌభ్రాతృత్వం అందిస్తూ ఉన్న భారత రాజ్యాంగం ఈ రోజు న ఆమోదించబడం గర్వకారణం…. ఒకే వ్యక్తికి ఒకే ఓటు ఒకే విలువ తో కూడిన రాజ్యాంగం అందించిన గొప్పమహానుభావుడు అని వారు కొనియాడారు.

Leave A Reply

Your email address will not be published.