వికలాంగుల అభ్యున్నతికి ప్రభుత్వ తోడ్పాటు

ఎడపల్లి , డిసెంబర్ 03 ( లోకంతీరు ) : వికలాంగుల దినోత్సవం సందర్భంగావికలాంగుల అభ్యున్నతి కోసం తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని భవిత పాఠశాల మండల ఇంచార్జ్ వైద్యుడు విజయ భాస్కర్ అన్నారు. బుధవారం వికలాంగుల దినోత్సవం సందర్భంగావికలాంగుల పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేశారు. ఎడపల్లి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కదం ప్రకాష్ రావు మాట్లాడుతూ.తల్లిదండ్రులు జాగ్రత్తగా మసులుకుంటే పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దవచ్చు అని అన్నారు. వికలాంగులైన పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రాజేష్, మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన తల్లిదండ్రులు , పిల్లలు పాల్గొన్నారు.