Take a fresh look at your lifestyle.

గాజుల సౌమ్య వీర మరణం మోస్రా లో విషాద ఛాయలు……

0

గాజుల సౌమ్య వీర మరణం

మోస్రా లో విషాద ఛాయలు

నిజామాబాద్ , జనవరి 31 ( లోకంతీరు ) : నిజామాబాద్ పట్టణంలో జనవరి 23 రోజున సాయంత్రం 7.00 గంటలకు గంజాయి మాఫియా అరాచక శక్తుల దుశ్చర్యకు లోనై మూత్రపిండాలు ( Kidney’s) , ప్లీహం( Spleen) , కాలేయం ( Liver) పోగొట్టుకుని కానిస్టేబుల్ గాజుల సౌమ్య నిమ్స్ హస్పిటల్ లో చావు బతుకుల మధ్య తొమ్మిది రోజులుగా మృత్యువుతో పోరాడి శనివారం రాత్రి 9.45 నిమిషాలకు తనువు వీరమరణం పొందింది.సౌమ్య తండ్రి గాజుల సాయిలు , తల్లి చంద్రకళ అంగడిలో నిత్యావసర సరుకులు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. తమ్ముడు శ్రవణ్ డిగ్రీ పూర్తి చేసి పోలీసు SI పరీక్షలకు సిద్ధమవుతున్నాడు.గంజాయి మరియు మాదక ద్రవ్యాల మీద ఉక్కుపాదం మోపడంలో కానిస్టేబుల్ సౌమ్య విధి నిర్వహణలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించి తన ప్రాణాలను త్యాగం చేయడం ద్వారా ఎక్సైజ్ శాఖ ప్రతిష్ట పెంచిందని నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు.సౌమ్య సాహసం అసమానమైనదని ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అన్నారు.ఆదివారం ఉదయం 9.00 గంటలకు మంత్రి కానిస్టేబుల్ గాజుల సౌమ్య భౌతికకాయానికి నివాళులు అర్పించి, ప్రభుత్వం తరపున ప్రకటన చేయడానికి నిమ్స్ హాస్పిటల్ కు రానున్నారు.ఎక్సైజ్ కానిస్టేబుల్ నుండి అడిషనల్ కమీషనర్ వరకు నేడు ఉదయం 8.30 గంటలకు నిమ్స్ హాస్పిటల్ ప్రాంగణం వద్ద యూనిఫారం తో హాజరై సౌమ్య త్యాగానికి నివాళులు అర్పించడం జరుగుతుంది.తెలంగాణ ఎక్సైజ్ అసోసియేషన్ జెఏసీ అంత్యక్రియలు సౌమ్య స్వగ్రామం మోస్రా గ్రామం , నిజామాబాద్ జిల్లాలో ఆదివారం సాయంత్రం 3.00 గంటలకు ప్రారంభం అవుతాయి.

Leave A Reply

Your email address will not be published.