బాపు నగర్ సర్పంచ్ , వార్డు సభ్యులుగా ఏకగ్రీవం
-
అధికారకంగా నియామక పత్రాలు అందజేత

ఎడపల్లి , డిసెంబర్ 03 ( లోకంతీరు ) :
ఎడపల్లి మండలం బాపునగర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గా నాగునూరి అనురాధ రాజ శేఖర్ తో పాటు వార్డ్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు బుధవారం అధికారికంగా నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాస్ రావుతోపాటు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఈరెంటీ లింగం బాపునగర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా నాగునూరి అనురాధ రాజశేఖర్ తో పాటు వార్డ్ సభ్యులను ఘనంగా సన్మానించి వారిని అభినందించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి, తమ వంతు కృషి చేస్తామని నియామకమైన సర్పంచ్ అభ్యర్థి నాగునూరి అనురాధ రాజశేఖర్ అన్నారు. తమపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా గ్రామస్తులు ఏకగ్రీవం కావడానికి పూర్తిస్థాయిలో సహకరించిన బాపునగర్ గ్రామస్తులకు పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాస్ రావు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఈరెంటి లింగం, జైతాపూర్ సహకార సంఘం అధ్యక్షులు కరటూరి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక గ్రామస్తులు తదితరులు ఉన్నారు.