Take a fresh look at your lifestyle.

ఆదరించండి అవకాశం కల్పించండి….

0

ఆదరించండి అవకాశం కల్పించండి

– సర్పంచ్ అభ్యర్థి పడిగల శ్రీనివాస్

రామారెడ్డి , డిసెంబర్ 06 ( లోకంతీరు ) : రామారెడ్డి గ్రామ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పడిగల శ్రీనివాస్ తనకు ఫూట్ బాల్ గుర్తు ఈ యొక్క గుర్తుకు ప్రజలందరూ ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. తాను సర్పంచిగా గెలుపొందిన వెను వెంటనే ప్రజల కొరకు ప్రజా సంక్షేమం కొరకు అహర్నిశలు సమయాన్ని కేటాయించి అభివృద్ధికి మరో పేరు అనే పదానికి ప్రగతి చక్రంల పనిచేయడానికి ప్రజలందరూ తమ అమూల్యమైన ఓటును వేసి గెలిపించగలరని కోరారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న పనులు, పూర్తిస్థాయి లైబ్రరీ, క్రీడాకారులకు అన్ని వసతులతో కూడిన గ్రౌండ్, విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేస్తాను, పాఠశాలలకు నూతన తరగతులు నిర్మించడం, బడి పిల్లలకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం, ప్రభుత్వ ఆసుపత్రి బాగు కొరకు నిధులు సమకూర్చడం, 30 పడకల ఆసుపత్రిగా గుర్తింపు కొరకు పాటుపడతాను, 24 గంటలు వైద్యం, బాధితులకు అంబులెన్స్ సౌకర్యం కల్పించడం, వృద్ధులు, వికలాంగులు, అర్హతలు కలిగిన వారికి నూతన పింఛన్లను మంజూరు చేయించడం, గ్రామంలో పలుచోట్ల వృద్ధుల కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేయడం, సిసి రోడ్లు డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించడం, ఉపాధి కల్పనకు పాటుపడడం, వ్యవసాయ రంగానికి కృషి చేయడం, అదేవిధంగా నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించడానికి సహాయ సహకారాలు అందించడం, గ్రామంలోని ప్రధాన దేవాలయాలు ఉమ్మడి సీతారామచంద్ర రాజరాజేశ్వర ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తాను, సురక్షితమైన త్రాగునీరు అందించడం, మండల కేంద్రంలో నేషనలైజ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం, శిథిలా అవస్థలో ఉన్న పాఠశాల భవనాలను తొలగించి నూతన భవనాలను నిర్మించడం, ప్రభుత్వ అనుబంధ సంస్థలకు పక్కా భవనాలను నిర్మించడం, బస్టాండ్ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దడం, యువతకు ఉపాధి కల్పన కల్పించడం, మన గ్రామానికి బతుకుదెరువు కొరకు వచ్చే సంచార జాతులకు వసతి కల్పించడం, అర్హులైన వారికి ఇళ్ల స్థలాలను కేటాయించడానికి సహకరిస్తాను, మీ సమస్యలే నా సమస్యలుగా భావించి ప్రతిక్షణం మీకోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి తక్షణమే సమస్యను పరిష్కరించడం, శిథిలావస్థలో ఉన్న కచీర్ భవనాన్ని నూతనంగా తీర్చిదిద్దడం, గ్రామంలోని గ్రామదేవతల ఆలయాల పునరుద్ధరణ, కొరకు పాటుపడతాను ఇంకా మరెన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకురావడానికి మీ అమూల్యమైన ఓటును ఫుట్ బాల్ సీరియల్ నెంబర్ 4 బ్యాలెట్ పై మీ అమూల్యమైన ఓటును వేసి గ్రామాభివృద్ధికి కృషి చేయడానికి సర్పంచిగా గెలిపించాలని కోరడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.