కాలభైరవుడి జన్మదిన వేడుకలు
![]()
రామారెడ్డి, నవంబర్ 12 ( లోకంతీరు ) : రామారెడ్డి మండల కేంద్రంలోని ఈసన్నపల్లి- రామారెడ్డి గ్రామాలలో వెలసిన శ్రీకాల భైరవ స్వామి మహా పుణ్యక్షేత్రం స్వామి వారికి ప్రతి సంవత్సరం కార్తీకమాసం పురస్కరించుకొని దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు స్వామివారి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుతుంటారు. వేడుకలలో భాగంగా ఉదయం 6 గంటలకు సంతతారాభిషేకం సప్తమి, దేవస్థాన పర్యవేక్షణలో ధ్వజారోహణము, మహా పూజ, దక్షయజ్ఞ కార్యక్రమములు, మధ్యాహ్నం స్వామివారికి సింధూర పూజ, డోలారోహణము, స్వామివారి నీటి కొలనులో పూజలు నిర్వహించి స్వామివారికి స్నానాలను ఆచరించి, స్వామివారిని అందంగా అలంకరించి, అంగరంగ వైభవంగా అందంగా రకరకాల పూల మాలలతో అలంకరించిన ఊయలలో శ్రీ కాలభైరవ స్వామి వారి బంగారు ఉత్సవ విగ్రహంతో ప్రత్యక్షంగా ప్రజలకు భక్తులకు దర్శనం కల్పించడం జరిగింది.స్వామివారి జన్మదిన వేడుకలను ఆలయ ఈవో ప్రభు రామచంద్రం, ఆధ్వర్యంలో ఘనంగా స్వామివారి జన్మదిన వేడుకలు జరిపించారు. సాయంత్రం భక్తులకు మహా అన్నదాన ప్రసాదం చేయడం జరిగింది. సాయంకాలం ఎడ్ల బండ్ల తో ఘనంగా స్వామివారి ఆలయం చుట్టూరా ఊరేగింపు జరిపారు. రాత్రి ఆలయ ప్రాంగణంలో ఒగ్గు కథ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.అంతేగాక రాత్రి స్వామివారి రథోత్సవము తెల్లవారుజాము సుమారు నాలుగు గంటలకు ఇరు గ్రామాల లోని ప్రధాన పుర వీధుల గుండా ఊరేగింపును నిర్వహించి అనంతరం దక్షయజ్ఞము అగ్నిగుండము లు నిర్వహించడం జరుగుతుంది.ఈ కార్యక్రమాలకు భారీ బందోబస్తుగా పోలీస్ శాఖ వారు భారీ కేట్లను ఏర్పాటు చేసి వాహనాలకు ఇబ్బంది లేకుండా, ప్రజలకు భక్తులకు సహాయ సహకారాలు అందిస్తున్నరూ,భక్తులకు అందుబాటులో వైద్య సిబ్బంది. అన్నదానం కార్యక్రమంలో జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు, స్వచ్ఛందంగా సేవకులు, యువకులు, పాల్గొని స్వామివారి జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమలలో ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ , వంశీకృష్ణ శర్మ, జూనియర్ అసిస్టెంట్ సిహెచ్ లక్ష్మణ్, ఆఫీస్ సబార్డినేటర్ నాగరాజు,భారత్,భాస్కర్ రెడ్డి , ఆయా గ్రామాల భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
