Take a fresh look at your lifestyle.

ప్రజల సమస్యలు తీర్చగలిగేసర్పంచులను గెలిపించాలి….

0

ప్రజల సమస్యలు తీర్చగలిగేసర్పంచులను గెలిపించాలి

ఎడపల్లి , డిసెంబర్ 06 ( లోకంతీరు ) : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎడపల్లి మండలంలో ఉన్న గ్రామపంచాయతీ లలో సర్పంచ్, వార్డు సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ ఫైనల్ పై పోటీ చేస్తున్న అభ్యర్థులను పార్టీ నాయకులు కార్యకర్తలు గెలుపునకు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సలహాదారులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. జానకంపేట, నెహ్రూ నగర్ లో గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్న సుంచనకోట అనురాధ .రాధా కిషన్ గౌడ్, ఆజ్ మేరీ బేగం, మీర్జా కాజా బేగ్ శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్యానల్ పై పోటీలో ఉన్న సర్పంచ్ . వార్డు సభ్యుల అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన నాయకులకు కార్యకర్తలకు సూచించారు. అన్ని గ్రామాలలో కాంగ్రెస్ జెండా ఎగరాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు సుంచనకోట రాధా. కిషన్ గౌడ్, జహీర్ ఖాన్, విజయ్ గౌడ్, అశ్వక్, మీర్జా కాజా బేగ్, అమానుల్లా షరీఫ్, ఎజాజ్, తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.