Take a fresh look at your lifestyle.

అంగన్వాడి ఉపాధ్యాయులు అందుబాటులో ఉండాలి….

0

అంగన్వాడి ఉపాధ్యాయులు అందుబాటులో ఉండాలి

– ఐసిడిఎస్ జిల్లా పి డి రసూల్ బి

 

ఎడపల్లి, డిసెంబర్ 08( లోకంతీరు ) :  అంగన్వాడి కేంద్రాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ విధుల్లో క్రమంగా ఉండాలని ఐసిడిఎస్ పిడి రసూల్ బి అన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని గంగమణి అంగన్వాడి కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఆమె వీధుల్లో ఉండడం పట్ల పిడి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం నయా బాధి లోని వారంతపు సంత పక్కన ఉన్న రాజేశ్వరి అంగన్వాడి కేంద్రాన్ని అక్కడి నుండి పక్క అద్దె గదిలోకి మార్చినట్లు తెలిపారు. వారం రోజుల్లోగా అద్దె ఇంటిలో అంగన్వాడి కేంద్రం కొనసాగుతున్నందున పిల్లలకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అలాగే అద్దె ఇంటిని శుభ్రంగా ఉంచి సున్నం వేయించాలని పిడి రసూల్ బి అంగన్వాడి ఉపాధ్యాయురాలు రాజేశ్వరి ని ఆదేశించారు. ఎలాంటి లోటు పాట్లకు లేకుండా సమయపాలన పాటించి అందుబాటులో ఉండాలని ఆమె అంగన్వాడి ఉపాధ్యాయులను సూచించారు. అంగన్వాడి ఉపాధ్యాయుల పనితీరు పట్ల పిడి రసూల్ బి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె వెంట అంగన్వాడి ఉపాధ్యాయులు గంగామణి. రాజేశ్వరి ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.