నగరంలో మరో దొంగతనం

నిజామాబాద్ క్రైమ్, నవంబర్ 24 ( లోకంతీరు ) : ఆదివారం వేకువజామున 3 గంటల 10 నిమిషాలకు నిజామాబాద్ లోని పెద్ద బజార్ ప్రాంతంలో గల జెర్సీ పాల వ్యాపారి విజయ్ సంగ్వాయి యొక్క ద్విచక్ర వాహనం యాక్టివా 3G ( బైక్ నెంబర్ TS 16EK 4484 ) దొంగలించడం జరిగింది. రోజు మాదిరిగానే ఉదయం లేచి చూసేసరికి తన వాహనం కనిపించలేదు. అక్కడే ఉన్న పెట్రోలింగ్ పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. ఈ యొక్క దృశ్యాలన్నీ సీసీ కెమెరాలలో నిక్షిప్తమయ్యాయి. సంఘటన స్థలానికి పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.