బోధన్ డివిజన్ లో ప్రతిష్ట బందోబస్తు
-
ఏసీపీ శ్రీనివాస్
ఎడపల్లి, డిసెంబర్ 10 ( లోకంతీరు ) : తొలి విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా బోధన్ డివిజ న్ లో ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎడపల్లి మండలంలో బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీసులకు ఏసీపి శ్రీనివాస్ సూచనలు చేశారు ఓటర్లు మొబైల్ ఫోన్ తీసుకురాకుండా చూడాలని ఆదేశించారు బోధన్ డివిజన్ వ్యాప్తంగా 1.200 మంది సిబ్బంది విధుల్లో ఉండగా. సమస్యాత్మక గ్రామాలలోని పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ అదనపు బలగాలను ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. స్థానిక సంస్థల గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత లో బోధన్ డివిజన్ పరిధిలోని ఎడపల్లి, బోధన్ రూరల్ ,నవపేట రెంజల్, కోటగిరి, వర్ని, మోస్రా రుద్రూర్, చందూర్ మండలాలలోని గ్రామాలలో గురువారం జరిగే పంచాయితీ ఎన్నికలలో సర్పంచ్, వార్డు సభ్యులకు పోలింగ్, ఓట్ల లెక్కింపు ఉన్నందున పోలీస్ అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని బోధన్ ఎసిపి శ్రీనివాస్ అన్నారు. ఎడపల్లి మండలంలో 16 గ్రామ పంచాయతీలో జరిగే మొదటి విడత పోలింగ్ కేంద్రాల పోలీసులు జాగ్రత్తగా ఉండాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద నుంచి,100, 200 మీటర్ల దూరంలో ముగ్గు వేయించాలన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ ఉన్నందున పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు ఎలాంటి గొడవలకు, తావివ్వకుండా శాంతియుత వాతావరణంలో పోలింగ్ జరపాలన్నారు , మధ్యాహ్నము రెండు తర్వాత కౌంటింగ్ ఉన్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. వార్డ్ సభ్యులు గెలిచిన వారిని పోలింగ్ కేంద్రం నుండి బయటకు పోకుండా అక్కడే కూర్చోబెట్టాలన్నారు. వార్డు సభ్యులందరూ కలిసి ఉప సర్పంచును ఎన్నుకోవాల్సి ఉంటుంది .కాబట్టి వార్డు సభ్యులుగా గెలిచిన వారిని ఏమాత్రం కూడా బయటకు పోనివ్వకు డదన్నారు ఒంటిగంట దాటిన తర్వాత ఓటర్లు ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వస్తే గేటు వద్దనే నిలిపివేయాలన్నారు. అవసరమైతే ఎన్నికల పోలింగ్, అసిస్టెంట్ పోలింగ్ అధికారులకు వెంటనే తెలపాలన్నారు ఓట్ల లెక్కింపు సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. గెలిచిన సర్పంచులు వార్డు సభ్యులకు సంబరాలు జరుపుకోవడానికి అనుమతి లేదన్నారు. ఎన్నికల నిబంధనాలను గ్రామస్తులు, ఓటర్లు పాటించాలన్నారు ప్రశాంతత వాతావరణం ఎన్నికలు జరిగేందుకు పోలీసులకు గ్రామస్తులు యువకులు సహకరించాలన్నారు. ఏసీపి శ్రీనివాస్ వెంట నిజామాబాద్ రూరల్ సిఐ సురేష్ కుమార్, బోధన్ రూరల్ సిఐ విజయ్ బాబు, ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ, పోలీస్ అధికారులు సిబ్బంది ఉన్నారు.