Take a fresh look at your lifestyle.

నూతన మద్యం పాలసీలో 129 కోట్ల ఆదాయం……

0

నూతన మద్యం పాలసీలో 129 కోట్ల ఆదాయం

  • డ్రగ్స్ నిర్ములన కొరకు పకడ్బందీ చర్యలు

  • ఎలక్షన్ ప్రశాంతంగా జరగాలి 

  • ఇప్పటి వరకు 43 కేసులు , 150 లీటర్ల మద్యం సీజ్

  • ఎక్సైజ్ శాఖ డ్యూప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి వెల్లడి….

ఉమ్మడి నిజామాబాద్ , డిసెంబర్ 10 ( లోకంతీరు ) : ఉమ్మడి నిజాంబాద్ జిల్లా వ్యాప్తంగా 2025-20 27 సంవత్సరానికి 151 వైన్ షాపులకు నూతన మద్యం పాలసీ ద్వారా సుమారు 129 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందని ఉమ్మడి జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి అన్నారు. బుధవారం లోకం తీరు ఆయనతో ముచ్చటించగా పలు రకాల విషయాలు వెల్లడించారు .గతంలో కంటే ఈ సంవత్సరం తొమ్మిది కోట్ల రూపాయలు ఆదాయం ఎక్కువగా వచ్చిందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు లోకల్ బాడీ ఎలక్షన్ సందర్భంగా వివిధ ప్రాంతాలలో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు 43 కేసులను నమోదు చేసి 150 లీటర్ల మద్యం ను సీజ్ చేసి కేసులు నమోదు చేశామన్నారు. ఎలక్షన్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రకాలుగా మా శాఖ పరంగా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఛెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో ద్వారా ఎటువంటి మద్యం రాకుండా అన్ని రకాల ఏర్పాటు చేశామన్నారు.అంతే కాకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. బెల్ట్ షాపులకు ఎటువంటి అనుమతులు లేవని, ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తే వారిపై చట్టరిత్య చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామన్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాల వరకు వివిధ గ్రామాల్లో మా సిబ్బంది తనిఖీ నిర్వహిస్తూ వస్తుందన్నారు . మన రాష్ట్రం కంటే పక్క రాష్ట్రంలో మద్యం ధరలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మన రాష్ట్రానికి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉందని మాహ రాష్ట్రంలో ఉన్నటువంటి దేశిదారు తరలిస్తే మాత్రం కఠిన చర్య తీసుకుని వారిపై కఠిన కేసులు పెట్టడం జరుగుతుందని హెచ్చరించారు .యువత డ్రగ్స్ బారిన పడకుండా అన్నీ శాఖలతో మమేకమై వాటి నిర్ములన కోసం అన్ని రకాలుగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. పర్మిట్ రుమాలు తప్పని సరి నిబంధనలు పాటించాలి … పర్మిట్ రూమ్ లు తప్పనిసరిగా విధి విధానాలు ,నిబంధనలు తప్పనిసరి గా పాటించాలన్నారు. నిబంధనలు ఉల్లాగేస్తే చర్యలు తప్పవని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.