ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్య వైఖరి..!
– ఆహార భద్రతపై అధికారుల అలసత్వం..!
– తనిఖీల్లో నిర్లక్ష్యం.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం..!
– కల్తీ ఆహారంపై చర్యలు ఎక్కడ..?
– ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యంతో వినియోగదారుల్లో ఆందోళన
– ప్రజారోగ్యాన్ని గాలికొదిలిన ఫుడ్ సేఫ్టీ అధికారులు..!


నిజామాబాద్/వర్ని, జులై 07 ( లోకంతీరు న్యూస్ ) : మండల కేంద్రం టిఫిన్ సెంటర్ ల నిర్వహణ ఇష్ట రాజ్యాంగ కొనసాగుతుంది.అపరిశుభ్ర వాతావరణంలో తినుబండారాల తయారీ ,నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్ సిలిండర్ల వినియోగం , కూల్లిపోయిన అలుకర్రి పెట్టాడం,ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. , మండల కేంద్రాలలో పలు టిఫిన్ సెంటర్లు, హోటళ్లలో ఆహార భద్రతా నిబంధనలను బేఖాతరు చేస్తూ అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నా ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు అందిస్తున్న ఆహార నాణ్యతపై ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో వినియోగదారుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ టిఫిన్ సెంటర్‌లో తీసిన చిత్రాల్లో తుప్పు పట్టిన టేబుళ్లు, అపరిశుభ్రమైన పాత్రలు, శుభ్రత లేని వంటగది, పాచిపట్టిన నీటి నిల్వలు, ఆహార పదార్థాలను నిర్లక్ష్యంగా నిల్వ చేయడం, వాణిజ్య గ్యాస్ సిలిండర్లను నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తయారవుతున్న ఆహారం వినియోగదారుల ఆరోగ్యానికి హానికరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆహార భద్రతా చట్టాల ప్రకారం రెగ్యులర్ తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించే హోటళ్లు, టిఫిన్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించి, నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు, ప్రజా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.