ఎడపల్లిలో పిట్ల ఎల్లయ్య వర్ధంతి

ఎడపల్లి , డిసెంబర్ 17 ( లోకంతీరు ) : ఎడపల్లి మండల కేంద్రంలో బుధవారం అఖిలభారత ఐక్య రైతుసంఘం కార్యాలయంలో .పిట్ల ఎల్లయ్య వర్ధంతి సభను నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గుమ్ముల గంగాధర్ మాట్లాడుతూ గతంలో పిట్ల ఎల్లయ్యను పీపుల్స్ వారు గత 35 సంవత్సరాల క్రితం చంపడం జరిగిందన్నారు .పీపుల్స్ వార్ పిట్ల ఎల్లయ్యను చంపితే అక్కడ రైతు కూలి సంఘం ఉండదని! భావించి కొంతమంది తనని దారుణంగా చంపించారని ఆయన గుర్తు చేశారు. భూమికోసం భుక్తి కోసం విముక్తి కోసం పోరాటం తను పేదవాళ్ల కోసం అనేక పోరాటంలో పాల్గొని వందలాదిఎకరాల భూమి పంపిణీ చేయించారని ఆయన తెలిపారు. గడ్కుల్ పరిధిలోని గ్రామాల్లో భూ పంపిణీ చేశారని ఆయన గుర్తు చేశారు. సిరికొండ మండల పరిధిలో ఉన్న గడ్కుల్ గ్రామం లో తను పుట్టి పెరిగి ఎర్రజెండాకు ఆకర్షితుడై ఇల్లు లేని వారికి ఇళ్లస్థలాల కోసం అనేక పోరాటాల్లో పాల్గొన్నారు. గత 35 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం నుంచి అఖిలభారత ఐక్య రైతు సంఘం గా ఏర్పడిందన్నారు ఈరోజు అవతరించి జిల్లాలో పోరాటాలు నిర్వహిస్తూ పేదలకు భూమి కోసం పేదవాళ్లకు ఇళ్లస్థలాల కోసం అట్లాగే పింఛన్ కోసం 2000 నుంచి 4000 పింఛన్ కోసం వికలాంగులకు 4000 నుంచి 6000 పింఛన్ కోసం ఈ అనేక పోరాటాల్లో సంఘం పనిచేస్తుంది ఒక వ్యక్తిని చంపినంత మాత్రాన ఈ సంఘం పూర్తిగా అంతరించి పోతుందని భ్రమ పేదోళ్లు ఉన్నంత వరకు ఎర్రజెండా ఉంటది పేదోళ్ల హక్కుల కోసం ఎర్రజెండా పని చేస్తుందని భావిస్తున్నాం అట్లాగే తన ఆశయం ఏదైతే ఉన్నదో ముందుకు తీసుకపోతామని వాగ్దానం చేస్తున్నాం చనిపోవడం జరుగుతున్నదనారు.అఖిలభారత ఐక్య రైతు సంఘం డివిజన్ నాయకులు శ్రీపతి మల్లేష్, కాశరవి,కొండ్ర భూమయ్య. రమేష్, అక్షయ్ పోశెట్టి ,శ్రీను, కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.