నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య , వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన పోచారం

కామారెడ్డి, జనవరి 28 ( లోకంతీరు ) : హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు, అలాగే సౌమ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. సౌమ్య సంపూర్ణంగా కోలుకుటుందని తిరిగి త్వరగా విధుల్లో చేరాలని ఆశిస్తున్నానాని తెలిపారు.పోచారం వెంట నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తదితరులు ఉన్నారు.