Take a fresh look at your lifestyle.

ఆదివాసీ నాయకపోడ్ అభివృద్ధి కొరకు నిరంతరం పోరాడాలి…..

0

ఆదివాసీ నాయకపోడ్ అభివృద్ధి కొరకు నిరంతరం పోరాడాలి

  • జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో గౌరవ అధ్యక్యుడు బండారి బోజన్న

 నిజామాబాద్ ,డిసెంబర్ 25 ( లోకంతీరు ) : నిజామాబాద్ జిల్లా ఆదివాసీ నాయకపోడ్ జిల్లా సేవా సంఘం నందు నూతనంగా జిల్లా బాడిని ఎన్నుకోవడం జరిగినది.గౌరవ అధ్యక్షులు బండారి బోజన్న ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా ప్రమాణస్వీకారం చేసిన ప్రతి ఒక్కరు ఆదివాసుల అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. అలాగే మనకు కావలిసిన హక్కులను మనం పూర్తిగా అందిపుచ్చుకొని సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి కృషి చేయాలన్నారు. ఆదివాసుల అభివృద్ధి కొరకు నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు నూతనంగా ఏర్పడిన కార్యవర్గాన్ని ప్రమాణం స్వీకారం చేయించారు.అధ్యక్షులు గా గాండ్ల రాంచంధర్  , ప్రధానకార్యదర్శి పుట్ట శివ శంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కావాల్కడి పోశెట్టి, కోశాధికారి గా శానం పవన్ కుమార్, అధికార ప్రతినిధి గా పుట్ట దుర్గ మల్లేష్ లు ఎన్నుకోబడ్డారు.తదనంతరం నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ , మఎం ఉప సర్పంచ్ అలాగే వార్డ్ మెంబర్లను ద్వారా జిల్లా ప్రజా ప్రతినిధుల ఫోరం కూడా ఎన్నుకోవడం జరిగినది. అధ్యక్షులు ఎర్రం శ్రీనివాస్ , జనరల్ సెక్రెటరీ దాత్రికి అంజయ్య , వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకరి రాజు , అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శి మిగతా వారిని ఎన్నుకోవడం జరిగినది . ఇట్టి ఎన్నికలు జిల్లా ఆదివాసి నాయకపోడ్ కుల సంఘాలు మరియు ఆదివాసి నాయపోడ్ బాంధవులు మరియు నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ ఉప సర్పంచ్లను ఘనంగా సన్మానించడం జరిగినది.

Leave A Reply

Your email address will not be published.