39 డివిజన్లో జోరుగా బీజేపీ ప్రచారం

నిజామాబాద్ , ఫిబ్రవరి 05 ( లోకంతీరు ) : నగరంలోని 39 వ డివిజన్లో బిజెపి అభ్యర్థి దాంపల్లి జ్యోతి మురళీకృష్ణ ప్రచారం ఇంటింటా చేస్తున్నారు. ప్రతి ఒక్కరి నుంచి మంచి స్పందన రావడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాపై నమ్మకంతో గెలిపిస్తే 39 వ డివిజన్ అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఎల్లవేళలా అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు . డివిజన్ ఓటర్లు నన్ను ఒక్కసారి ఆశీర్వదించి కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.